నా దేశం తెలుగుదేశమే నాది తెలుగుబిడ్డనే నేను తెలుగు పేరు వింటేనే మురిసిపోతాను తెలుగుభాష అంటే మైమచిపోతాను. నన్నయభట్టిక్కడనే పుట్టినాడు తిక్కనకవి గంటమిచట పట్టినాడు పోతన్నలు, శ్రీనాథులు, రామరాజ భూషణులు తెలుగుభాషకే వన్నెలు దిద్దినారూ తెలుగుజాతి నాల్కలపై నిలిచినారు. ఆట వెలదులను ముద్దుల మూటగట్టె వేమన్న భావ కాలగతుల తెలియ బల్కెను వీరబ్రహ్మం కర్నాటక గానానికె, కళదెచ్చెను త్యాగరాజు, ఇంతటి విజ్ఞానధనులు ఎవరున్నారు వెదకిచూచినాగాని కానరారూ. బరిపై తొడగొట్టి, కత్తి బట్టెను నాయకురాలు, పురుష వేషమున శత్రువు నురుమాడెను రుద్రమ్మ, పురుష వేషమున శత్రుల నురుమాడెను రుద్రమ్మ, మొల్లలు మల్లమదేవులు, మహిళలకే మణిపూసలు, తెలుగుగడ్డకే, పేరు దెచ్చినారు స్త్రీ జాతికి గౌరవమ్ము నిచ్చినారు. ఓరుగల్లు నేలిన శూరుడు ప్రతాపరుద్రుడు పౌరుషమ్ము చిందించిన బాలచంద్రుడు రాచకొండ వెలమ దొరలు కొండవీటి రెడ్డి విభులు మన ప్రతాపమునకు బలే మచ్చుతునకలు వేడినెత్రు పారించిన వీరపుత్రులు కలియు భీముడని బిరుదు గొన్న, "కోడెరామమూర్తి" అద్భతమేధావిగ, పే రందిన "విశ్వేశ్వరయ్య" జగము మెచ్చు "రా...
క్షోణితలంబు నెన్నుదురు సోకగ వందనంబు తెలుగు తల్లికి.