ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

konduru vira raghavaacharyulu లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

మోహనాంగి

కొండూరి వారిచే అద్భుతముగా తీర్చి దిద్దబడిన చారిత్రాత్మక నవల ఇది. సాహితీ సమరాంగణ సార్వభౌముడైన శ్రీ కృష్ణదేవరాయల పుత్రిక తిరుమలాంబ. ఆమెను రాయలు మోహనాంగి యను ముద్దుపేరున పిలుచుకొనువాడు. మోహనాంగి సంగీత సాహిత్యములందు అపర సరస్వతి;చిత్ర కళానిధి; మారీచీపరిణయమును వ్రాసిన మహాకవయిత్రి. అరవీటి రామరాజునకు అర్ధాంగియైన సాధ్వీతిలకము. మోహనాంగీ రామరాజులను నాయికా నాయకులనుగా వరించిన చరిత్రాత్మకమగు నవల యిది. అయినను మోహనాంగి కథకే ప్రాధాన్యమెక్కువ. పూర్తి పుస్తకం కోసం  మోహనాంగి క్లిక్ చేయండి. Digital Library of India వారి సౌజన్యంతో (http:// www.new.dli.ernet.in/ )

అమరావతి

అమరావతి పేరు విన్నంతనే ప్రతి ఆంధ్రుని హృదయముకూడ ఉప్పొంగి పోవును; ప్రతి భక్తుని చిత్తము గూడ భక్తితో తన్మయమగును. ప్రాచీనకాలపు విజ్ఞాన వైభవమునకు, శిల్పకళా ప్రాభవమునకు, అఖండ బౌద్ధ సంస్కృతికి గురుపీఠమై దేశదేశాంతరములలో నాగరికతా దీప్తులను ప్రసరింపజేసిన అమరావతి ఆంధ్రులకే కాదు, భారతీయులందరికిని ఆరాధింప దగిన పవిత్రస్థానము; స్మరింపదగిన చారిత్రక ప్రదేశము. శాతవాహన రాజులు మగధ నుండి కన్యాకుమారిదాక దక్షిణాపథమును పాలించెడి రోజులలో కృష్ణానది యొడ్డున నున్న ధాన్యకటకము దక్షిణదేశపు నగరములకన్నింటికిని తలపూవై ప్రకాశించినది... పూర్తి పుస్తకం కోసం అమరావతి క్లిక్ చేయండి.

భోజరాజీయము

దర్శనాచార్య శ్రీ కొండూరు వీర రాఘవచార్యులచే సంగ్రహించబడిన భోజరాజీయము. పూర్తి పుస్తకం కోసం  భోజరాజీయము క్లిక్ చేయండి.