ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

tapi dharma rao లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

భోగకాంత నిర్ణయము

 తాపీ ధర్మారావు గారి 'సాహితీ మొర్మొరాలు' పుస్తకం నుంచి ఓ వ్యాసం నిజమెంతో అబద్ధమెంతో తెలియదు గానీ , ఒక చిన్న కథ చెప్పుకుంటారు , సంస్కృతసాహిత్యం చదువుకున్నవారు . ఈ సంగతయినా కథగా చెప్పుకోరు . పెద్ద చరిత్రాత్మకమయిన విషయంగా చెప్పుతారు . ఏది ఎలాగున్నా , అది విమర్శకులు వినవలసినదే . కాబట్టి మనవి చేస్తాను . చెప్పుకొనే కథ ధారా నగరమో, ఉజ్జయినీ నగరమో ఏదో నగరము . మహారాజుగారి కొలువుకూటం . పని ముగిసిపోయింది . సాయంకాలం ౪ గంటలవేళ ( ఇప్పటి వాచీల ప్రకారం ) అయింది . ఇద్దరు యువకవులు పని ఏమీ లేక పోవడం చేత అలా షికారు బయలుదేరారు . ఎక్కడికి ? వేశ్యవాటికకు - అంటే భోగం వీధికి . దుష్టచింతతో కాదు . సౌందర్య పిపాసతో . వేశ్యవాటికలు ఆ రోజులలో వేశ్యవాటికలు అంటే యిప్పటి భోగం వీధులలాగా వుండేవి కావు . అప్పటి వేశ్యలూ యిప్పటి భోగంవాళ్ళలాగా వుండేవారు కారు . వేశ్యలు బాగా చదువులలోనూ , సంగీతంలోనూ , కళలలోనూ కౌశలం వున్నవారు . వేశ్య వాటికలకు పోవడం ఆ రోజులలో - ఎందుచేతనో యిప్పటంత హేయంగా వుండేది కాదు . ఆ రోజులలో సాయంకాలం నాలుగు గంటలవేళకు ...

కృష్ణుడి శిరస్సును సత్యభామ తన్నిందా?

 తాపీ ధర్మారావు గారి 'సాహితీ మొర్మొరాలు' పుస్తకం నుంచి ఓ వ్యాసం. ముక్కు తిమ్మన్నార్యు ముద్దు పలుకనీ, ముక్కు తిమ్మన్న ముద్దు ముద్దుగా ఏడ్చాడనీ, సహృదయు లన్నారు. మెప్పుకోసము చెప్పిన ఈ మాటలు పాఠకలోకాన్ని తప్పుదారి పట్టించాయేమో అని సందేహం కలుగుతుంది ఎందుచేతనంటే ఈ ప్రశంసపల్ల పాఠకులదృష్టి మాటలమీదను, వాటి ముద్దుతనం మీదను లగ్నమయిపోతుంది. ముద్దు మాటలు చూసి మురిసిపోతారు. ఇంతకంటే ఆ కావ్యంలో చూడవలసిందే లేదని అనుకుంటారు. భావం కోసం బాధపడవలసిన అవసరమే కనపడదు. అందుచేతనే కాబోలు, పారి జాతాపహరణం అభిమాన ప్రబంధంగా పఠించిన వారి సంఖ్య చాల తక్కువ. తక్కిన ప్రబంధాలలోని ఘట్టాలకు ఘట్టాలే కంఠస్థంగా వున్నవారు చాల మంది కనబడతారు; గాని పారిజాతాపహరణంలో నుంచి పట్టుమని పది పద్యాలయినా నోటికి వచ్చినవారు కనబడరు. ఆ పద్యాలయినా పాదతాడన ఘట్టింలోనివి. "పాటలగంధి చిత్తముల పాటిలు కోపభరంబు తీర్ప" కృష్ణుడు మ్రొక్కిన పద్యము? ... లతాంతాయుధు కన్నతండ్రి శిరము సత్యభమ వామపాదంతో తొలగద్రోసిన పద్యము "ఈసున బూట్టి డెందమున హెచ్చిన కోప దవానలంబుచే గాసిలి" సత్య ఏడ్చిన పద్యము - ఇలాంటివి మాత్రము వినగలుగుతాము. ఆ చదివిన ధ...