ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

అగస్త్యుడు లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

అగస్త్యుడు

శ్రీ రామరక్ష : జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం గుర్రము తిన్న గుగ్గిళ్ళు జీర్ణమై ఏనుగు తిన్న వెలక్కాయ జీర్ణమై భీముడు తిన్న పండివంటలు జీర్ణమై అర్జునుడు తిన్న అప్పాలు జీర్ణమై అబ్బాయి తిన్న పాలు ఉగ్గు జీర్ణమై కుంది లాగా కూర్చొని నంది లాగా లేచి తాంబేలు లాగా తాళి చల్లగా ఉండాలి శ్రీరామ రక్ష నూరేళ్ళాయుస్సు తి.తి.దే వారి హిందూ ధర్మ పరిచయం పుస్తకం నుంచి - శ్రీ ముదివర్తి కొండమాచార్యులు గారు బిడ్డకు వుగ్గుపెట్టి పొట్ట నిమురుతూ మెల్లిగా కాలుచేతులు ముడిచి సాగదీస్తూ తల్లులు ఈ పాట పాడుతారు. తనబిడ్డ అగస్త్యుడిమాదిరి తిన్నది అరిగించుకుని దినదినాభివృద్ధి పొందుతూ ఆరోగ్యవంతుడై, ఆయుష్మంతుడై సుఖంగా వుండాలని తల్లి కోరుకుంటుంది. ప్రాతః స్మరణీయుడైన ఈ అగస్త్యుడు దైవాంశసంభూతుడు. మహా తపస్వి. ఉదారచరితుడు. కరుణాస్వభావుడు. వీర్యవిక్రమసంపన్నుడు. ఆయన త్యాగమయ జీవితం చతుర్యుగాలకు విస్తరించి వుంది. జననం:            అగస్త్యుడు మనమాదిరి మాతృగర్భం నుంచి ఉదయించలేదు. కలశం నుంచి ఉద్భవించాడు. ఆయన పుట్టుక బహు విచిత్రమైనది. ఇక్ష్వాకు పుత్రుడైన నిమి అనే రాజు...

ఆదిత్య హృదయము

ఆదిత్య హృదయము కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి.   తి.తి.దే. ప్రచురణ ప్రతిపదార్థం తతః - అనంతరమందు యుద్ధపరిశ్రాంతం - యుద్ధమునందలసి యున్నట్టియు సముపస్థితం - సమీపంగా వచ్చియున్నట్టి రావణంచ - రావణుని గూడ అగ్రతః - ఎదురుగా దృష్ట్వా - చూచి సమరే - యుద్ధమందు చింతయా - చింతతో స్థితం - ఉన్నవాడును ౨. దైవతైశ్చ - దేవతలతో గూడ సమాగమ్యః - కలసికొని రణం - యుద్ధమును దృష్టం - చూచుటకు అభ్యాగతః - సమయానికి వచ్చినటువంటినీ భగవాన్ - త్రికాలజ్ఞుడైన అగస్త్యః - అగస్త్యుడను ఋషిః - మహర్షి ఉపాగమ్యః - దగ్గరకు వచ్చి రామం - రాముని గూర్చి అబ్రవీత్ - పలికెను ౩. వత్స - కుమారా మహాబాహో - దీర్ఘమైన భుజాలు గలవాడా యేన - ఏ స్త్రోత్రము చేత సర్వాన్ - సమస్తమైన అరీ౯ - శత్రువులను సమరే - యుద్ధమందు విజయిష్యసి - జయింపగలవో తం - అటువంటి సనాతనం - నిత్యమైనదియు గుహ్యం - రహస్యమైనదియు నగు శృణు - వినుము ౪. ఆదిత్య హృదయం - ఆదిత్య హృదయమను స్త్రోత్రము పుణ్యం - పుణ్యమును గలుగ జేయును సర్వశత్రు వినాశనం - సమస్త శత్రువులను నాశనం జేయునది జయావహం - జయకరమైనది అక్షయం - నాశరహితమై నదియు పరమం - ఉత్కృష్టమైన శివం...