ఆరుద్ర గారి "వ్యాసపీఠం" నుంచి ఓ వ్యాసం మహాభారతంలో "అయ్యో పాపం!" అనిపించి సానుభూతికి నోచుకునే కొన్ని పాత్రలలో ఏకలవ్యుడు ఒకడు. ఈ ఉదాత్త పాత్ర గురించి సామాన్య పాఠకులకూ సాధారణ సాహితీ పరులకూ తెలుగు భారతం, ఆది పర్వంలో లభ్యమైనంత సమాచారం మాత్రమే తెలుసు. ఆదిపర్ం పంచమాశ్వాసంలో ౨౩౧వ వచనం నుంచి ౨౫వ పద్యం దాకా పదిహేను గద్య పద్యాలలో నన్నయ్యగారు ఏకలవ్వుని అస్త్ర విద్యాభ్యాసం, పాటవ ప్రదర్శనం, గురుదక్షిణ సమర్పణం తెలియజేశారు. తన శిష్యులలో ఒకే ఒకణ్ణి అందరి అందరికన్నా మిన్నగా చేయాలని ఇంకొక అసమాన పరాక్రమశాలిని ఆచార్యుడు అంగవికలునిగా చేయడం అనుచితం. అడిగి బొటనవ్రేలు కోసి ఇచ్చిన శిష్యుడు మహోన్నత వ్యక్తి. ఈ ఘట్టం తర్వాత ఏకలవ్యుడు ఏమయ్యాడు? ఈ ప్రశ్నకు తెలుగు భారతంలో జవాబు దొరకదు. భారత కథలో ఎంతో ప్రముఖ పాత్రను వహించకపోతే ఆదిపర్వంలో ఏకలవ్యుని కథను కథనం చేయడం అనవసరం. తెలుగు భారతంలో దొరకదు గానీ వ్యాస భారతంలో ఏకలవ్యుని అట్టు పుట్టు ఆనవాళ్ళన్నీ ఓపికతో గాలించితే చేతినిండా చిక్కుతాయి. నన్నయ్యగారు గానీ, తిక్కన గారు గానీ వ్యాస భారతాన్ని యధామూలంగా అనువదించకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. భారతాని...
కొండూరి వారిచే అద్భుతముగా తీర్చి దిద్దబడిన చారిత్రాత్మక నవల ఇది. సాహితీ సమరాంగణ సార్వభౌముడైన శ్రీ కృష్ణదేవరాయల పుత్రిక తిరుమలాంబ. ఆమెను రాయలు మోహనాంగి యను ముద్దుపేరున పిలుచుకొనువాడు. మోహనాంగి సంగీత సాహిత్యములందు అపర సరస్వతి;చిత్ర కళానిధి; మారీచీపరిణయమును వ్రాసిన మహాకవయిత్రి. అరవీటి రామరాజునకు అర్ధాంగియైన సాధ్వీతిలకము. మోహనాంగీ రామరాజులను నాయికా నాయకులనుగా వరించిన చరిత్రాత్మకమగు నవల యిది. అయినను మోహనాంగి కథకే ప్రాధాన్యమెక్కువ. పూర్తి పుస్తకం కోసం మోహనాంగి క్లిక్ చేయండి. Digital Library of India వారి సౌజన్యంతో (http:// www.new.dli.ernet.in/ )
మానవుడికీ పశువుకీ గల ముఖ్యమైన తేడాల్లో భాష ఒకటి. ఒక జాతి సంస్కృతిగానీ, చరిత్ర గానీ కళలు గానీ, సాహిత్యం గానీ అన్నీ భాష మీదే ఆధారపడి ఉంటాయి. అభిప్రాయాల్ని వ్యక్తపరిచే ఒక సాధనం భాష... తెలుగు భాషకి ఎన్ని పేర్లున్నాయి? అవి ఎలా వచ్చాయి?.. ఋగ్వేదంలోనే 'ఆంధ్ర' పదం ఉంది... పూర్తి పుస్తకం కోసం మన తెలుగు తెలుసుకుందాం క్లిక్ చేయండి.
అమరావతి పేరు విన్నంతనే ప్రతి ఆంధ్రుని హృదయముకూడ ఉప్పొంగి పోవును; ప్రతి భక్తుని చిత్తము గూడ భక్తితో తన్మయమగును. ప్రాచీనకాలపు విజ్ఞాన వైభవమునకు, శిల్పకళా ప్రాభవమునకు, అఖండ బౌద్ధ సంస్కృతికి గురుపీఠమై దేశదేశాంతరములలో నాగరికతా దీప్తులను ప్రసరింపజేసిన అమరావతి ఆంధ్రులకే కాదు, భారతీయులందరికిని ఆరాధింప దగిన పవిత్రస్థానము; స్మరింపదగిన చారిత్రక ప్రదేశము. శాతవాహన రాజులు మగధ నుండి కన్యాకుమారిదాక దక్షిణాపథమును పాలించెడి రోజులలో కృష్ణానది యొడ్డున నున్న ధాన్యకటకము దక్షిణదేశపు నగరములకన్నింటికిని తలపూవై ప్రకాశించినది... పూర్తి పుస్తకం కోసం అమరావతి క్లిక్ చేయండి.
మొదట Downloader-NEW ( Downloader-OLD )ని డౌన్లోడ్ చేసుకోండి. ఇంతకు ముందే Downloader-OLD డౌన్లోడ్ చేసుకున్నట్లయితే update(NEW) కోసం Update(12-09-10) click చెయ్యండి. Unzip చెయ్యండి. runDM.bat file ని run చెయ్యండి. 'chandamama' option select చేయండి. 'Download Location' field లో మీరు ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ ఇవ్వండి like C:\ లేదా 'Browse' Button click చేసి location select చేసుకోండి. 'Year','Month' select చేసుకొని 'download' button click చెయ్యండి. ఒక్కో పేజి download అయిన తర్వాత ఇది ఒకే pdf file గా కలుపుతుంది(with year-month name). ------------------------------------------- 1st Picture లో 'Digital Library ' select చేసుకుంటే Digital Library of India నుంచి పుస్తకాలు డౌన్లోడ్ చేసుకోవచ్చు. 'http://www.new.dli.ernet.in/' లో పుస్తకం వెతికి URL తెచ్చుకొని, దాన్ని 'URL' field లో paste చేసి 'add to download ' button click చెయ్యండి. తర్వాత 'd...