ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

మోహనాంగి





కొండూరి వారిచే అద్భుతముగా తీర్చి దిద్దబడిన చారిత్రాత్మక నవల ఇది.

సాహితీ సమరాంగణ సార్వభౌముడైన శ్రీ కృష్ణదేవరాయల పుత్రిక తిరుమలాంబ. ఆమెను రాయలు మోహనాంగి యను ముద్దుపేరున పిలుచుకొనువాడు.
మోహనాంగి సంగీత సాహిత్యములందు అపర సరస్వతి;చిత్ర కళానిధి; మారీచీపరిణయమును వ్రాసిన మహాకవయిత్రి. అరవీటి రామరాజునకు అర్ధాంగియైన సాధ్వీతిలకము.
మోహనాంగీ రామరాజులను నాయికా నాయకులనుగా వరించిన చరిత్రాత్మకమగు నవల యిది. అయినను మోహనాంగి కథకే ప్రాధాన్యమెక్కువ.
పూర్తి పుస్తకం కోసం మోహనాంగి క్లిక్ చేయండి.
Digital Library of India వారి సౌజన్యంతో (http://www.new.dli.ernet.in/)
Posted by Picasa

కామెంట్‌లు

  1. నేను తెలుగురచయిత్రులమీద వ్యాసం రాసినప్పుడు, ఆచార్య నాయని కృష్ణకుమారిగారివంటి ప్రముఖ సాహితీవేత్తలు కృష్ణదేవరాయలుకి అసలు పుత్రిక వున్నట్టు నిదర్శనాలు లేవు అన్నారు. మీకు ఈవిషయంలో ఇంకా ఏమైనా తెలిస్తే చెప్పగలరు. మోహనాంగి నవల సేవ్ చేసుకున్నాను. చదివినతరవాత మళ్లీ కనిపిస్తాను. ఈపోస్టుకి చాలా చాలా కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  2. నమస్కారం అమ్మా,
    నాకైతే ఈ విషయం లో ఏమీ తెలియదు.
    కొండూరి వారి గురించి మీకు తెలిసే ఉంటుంది.
    వారు దీని మీద పరిశోధన చేసిన తర్వాతే, ఈ నవల వ్రాసి ఉంటారు.
    వారి గురించి
    http://naprapamcham.blogspot.com/2008/02/7.html

    మీ వ్యాఖ్య కోసం చూస్తుంటాను.

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలుగు భాష తీపిదనం

సి.వేదవతి గారి పుస్తకం 'తెలుగు-వెలుగు' నుంచి. "మహిమున్ వాగను శాసనుండు సృజియంపం గుండలీంద్రుండు దన్ మహనీయస్థితి మూలమై నిలువ శ్రీనాథుండు ప్రోవన్ మహా మహులై సోముడు భాస్కరుండు వెలయింపన్ సొంపు పాటించు నీ బహుళాంధ్రోక్తిమయ ప్రపంచమున తత్ప్రాగల్భ్య మూహించెదన్."                                                                                                    - రామరాజ భూషణుడు. వేయి ఏళ్ళుగా తెలుగుజాతి వేయి విధాలుగా పండించుకొన్న సజీవ భాష తెలుగు భాష. ఆంధ్రభాష అమృతం వంటిదనీ, దేశ భాషలలో ఎన్నికను గడించిందనీ అనటానికి...

గిజిగాడు

జిలుగుం బంగరు రంగులం గులుకు మేల్చిన్నారి పూగుత్తి సొ మ్ములు గీలించిని తుమ్మగొమ్మలకు, నీవు న్నీ సతీరత్న మూ యెల గీమున్ దగిలించి రేఁబవలు హాయిందూఁగరా గాడ్పు బి డ్డలు మీ కూడిగ మాచరింప, గిజిగాఁడా నీకు దీర్ఘాయువౌ! తేలిక గడ్డి పోచఁలను దెచ్చి, రచించెద వీవు తూఁగటు య్యేల గృహంబు, మాలవుల కేరికి సాధ్యముగాదు, దానిలో జాలరు, లందులో జిలుఁగు శయ్యలు నంతిపురంబు లొప్పగా మేలు భళీ! పులుంగుటెకిమీడవురా గిజిగాఁడ? నీడజా! కులుకు పసిండినిగ్గుల దుకూలములన్ ధరియించి ముద్దు బి డ్డలును, బడంతి నీ పొదిగిట న్ని దురింపఁగఁ గన్నెగాడ్పు లూ యెల సదనంబుఁలూచ, భయమింత యెరుంగక కన్నుమూయు నీ యలఘు సుఖంబు మాకుఁ గలదా! గిజిగా? యొక ఱేని కున్నదా? అందమున నీకు నీడగు నందగాడు గృహవినిర్మాణమున నిన్ను గెలుచువాడు వైభవంబునఁ బోలు దేవతల ఱేఁడు లేఁడురా గి జిగా! మొనగాఁడ వోయి నీ గిజిగాని నామకము, నీ తెలివిం బ్రకటించు గూడు, నీ మైఁగల సోయగం బవని మానవకోటికి ముద్దుసేయు నో యీ! గిజిగాడ! భీతిలకు! నీవు ధరాతలి నున్న బిట్టుగా వాగెడు నాస్తికు ల్తలు వంతు రనంతుని చెంత ఖిన్నులై.

ఏకలవ్యుని పుట్టువూర్వోత్తరాలు - ఆరుద్ర

ఆరుద్ర గారి "వ్యాసపీఠం" నుంచి ఓ వ్యాసం మహాభారతంలో "అయ్యో పాపం!" అనిపించి సానుభూతికి నోచుకునే కొన్ని పాత్రలలో ఏకలవ్యుడు ఒకడు. ఈ ఉదాత్త పాత్ర గురించి సామాన్య పాఠకులకూ సాధారణ సాహితీ పరులకూ తెలుగు భారతం, ఆది పర్వంలో లభ్యమైనంత సమాచారం మాత్రమే తెలుసు. ఆదిపర్ం పంచమాశ్వాసంలో ౨౩౧వ వచనం నుంచి ౨౫వ పద్యం దాకా పదిహేను గద్య పద్యాలలో నన్నయ్యగారు ఏకలవ్వుని అస్త్ర విద్యాభ్యాసం, పాటవ ప్రదర్శనం, గురుదక్షిణ సమర్పణం తెలియజేశారు. తన శిష్యులలో  ఒకే ఒకణ్ణి అందరి అందరికన్నా మిన్నగా చేయాలని ఇంకొక అసమాన పరాక్రమశాలిని ఆచార్యుడు అంగవికలునిగా చేయడం అనుచితం. అడిగి బొటనవ్రేలు కోసి ఇచ్చిన శిష్యుడు మహోన్నత వ్యక్తి. ఈ ఘట్టం తర్వాత ఏకలవ్యుడు ఏమయ్యాడు? ఈ ప్రశ్నకు తెలుగు భారతంలో జవాబు దొరకదు. భారత కథలో ఎంతో ప్రముఖ పాత్రను వహించకపోతే ఆదిపర్వంలో ఏకలవ్యుని కథను కథనం చేయడం అనవసరం. తెలుగు భారతంలో దొరకదు గానీ వ్యాస భారతంలో ఏకలవ్యుని అట్టు పుట్టు ఆనవాళ్ళన్నీ ఓపికతో గాలించితే చేతినిండా చిక్కుతాయి. నన్నయ్యగారు గానీ, తిక్కన గారు గానీ వ్యాస భారతాన్ని యధామూలంగా అనువదించకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. భారతాని...