ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

వ్యాసములు లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

తెలుగు భాష తీపిదనం

సి.వేదవతి గారి పుస్తకం 'తెలుగు-వెలుగు' నుంచి. "మహిమున్ వాగను శాసనుండు సృజియంపం గుండలీంద్రుండు దన్ మహనీయస్థితి మూలమై నిలువ శ్రీనాథుండు ప్రోవన్ మహా మహులై సోముడు భాస్కరుండు వెలయింపన్ సొంపు పాటించు నీ బహుళాంధ్రోక్తిమయ ప్రపంచమున తత్ప్రాగల్భ్య మూహించెదన్."                                                                                                    - రామరాజ భూషణుడు. వేయి ఏళ్ళుగా తెలుగుజాతి వేయి విధాలుగా పండించుకొన్న సజీవ భాష తెలుగు భాష. ఆంధ్రభాష అమృతం వంటిదనీ, దేశ భాషలలో ఎన్నికను గడించిందనీ అనటానికి...

వీరరాఘవ వ్యాసావళి

వీరరాఘవ వ్యాసావళి నుంచి మొదటి వ్యాసము సారస్వతము - సాహిత్యము  డౌన్లోడ్ చేసుకోవటానికి క్లిక్ చేయండి

వేమన యోగసిద్ధి - మత ప్రచారము

రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారి 'వేమన' పుస్తకం నుంచి సకల జగత్కారణమైన మూలవస్తువొకటి కలదని మన ప్రాచీనులు వేలకొలఁది యేండ్ల క్రిందనే గ్రహించిరి. దాని తత్త్వము నెఱిఁగిన పక్షమున, సృష్టియందలి సందేహములకెల్ల నందు ప్రత్యుత్తరములు లభించుననియు, బంధములన్నియు నుడుగుననియుఁ దలఁచిరి - "భిద్యతే హృదయగ్రన్థి శ్చిద్యన్తే సర్వసంశయాః క్షీయన్తే సర్వకర్మాణి తస్మిన్ దృష్టే పరావరే" అది సగుణమయినను నిర్గుణమైనను శూన్యమైనను దాని స్వరూపము ననుభవపూర్వకముగ నెఱుఁగక తీఱదని తేలినది. కాని దాని నెఱుఁగుట యెట్లు? మితమైన శక్తిగల కన్ను ముక్కు మొదలగు బహిరింద్రియములచే సాధ్యముగాదు. సాధ్యమైనచో అమితమైన ప్రభావముగల మనస్సను అంతరింద్రియముచేతనే కావలయును. కాని యీ మనస్సు చంచలమైనది. నిమేష కాలమైనను ఒకవిషయమును ధ్యానించు దార్ఢ్యములేనిది. దానికితోడు శరీరమందును సంసారమందును గలుగు వివిధావస్థలు దానిని ఒకచోట నిలువనీయవు. కావున మనస్సు ఈ దేహమునకును బహిస్సంసారమునకును లోబడక తనంతట అఖండముగా నిలిచి కార్యమును నిర్వహించు మార్గమొకటి వెదకవలసివచ్చెను. అదే యోగము - "యదా పఞ్చావరిష్ఠన్తే జ్ఞానాని మనసాసహ బుద్ధిశ్చన విచేష్టతి తామాహుః పరమా...

ఆంధ్రకవితా పితామహ అల్లసాని పెద్దన

'పెద్దన' పుస్తకం నుంచి(రచయిత పేరు గుర్తులేదు) పెద్దన్న గారికి ' ఆంధ్రకవితాపితామహుఁ 'డని బిరుదు శ్రీకృష్ణదేవరాయలవారిచ్చినది. కృష్ణరాయఁడు విద్వత్ప్రభువు, భావుకుడు. సహజముగా గొప్పకవి. ఆ ప్రభువునకు తత్పూర్వమున కవిత్రయము, పోతన్న, శ్రీనాథుఁడు మొదలైన మహానుభావులున్నారని తెలియదా? నాచన సోమనయున్నాడని తెలియదా! పెద్దన్న కీ బిరుదిచ్చట యేమి? తాను వైష్ణవ ప్రభువు. పెద్దన్నకూడ వైష్ణవుఁడే. ఈ కారణముచేత నిచ్చెనా? లేదా, ఆంధ్రకవిత యనగా, కృష్ణరాయని యభిమతము వేఱా? తత్పూర్వకవులందఱు సంస్కృతకావ్యములు తెలుగు చేసిరి. తొలుదొల్త స్వతంత్రకావ్యమును తెలుగులో పెద్దన గారే వ్రాసిరి. అందుచేత నిచటినుండియే యాంధ్రకవితాప్రారంభ మనియా?  పెద్దన్నగారును మార్కండేయ పురాణములోని కథను స్వీకరించియే వ్రాసిరి. పూర్వకవుల తెల్లగుసేతయు మక్కికి మక్కిగా లేదు. కనుక నిదియే యాంధ్రకవితాసమారంభ మనుటకు రాయల వారి బుద్ధిలో పద్యరచన యని కాదు. తెలుగు సేత కాదు. స్వతంత్రకావ్య మనిపించుకోదగిన యాంధ్రగ్రంథమని నిర్ణయము చేసికోవచ్చును. ఇచట ప్రాధాన్యము కావ్యశబ్దమునకు. ఈ లెక్కను భారతము కావ్యము కాసింత పెంపులు, తగ్గింపు లున్నను తెలుగులో స్వతంత్రకావ్యమ...

ఏకలవ్యుని పుట్టువూర్వోత్తరాలు - ఆరుద్ర

ఆరుద్ర గారి "వ్యాసపీఠం" నుంచి ఓ వ్యాసం మహాభారతంలో "అయ్యో పాపం!" అనిపించి సానుభూతికి నోచుకునే కొన్ని పాత్రలలో ఏకలవ్యుడు ఒకడు. ఈ ఉదాత్త పాత్ర గురించి సామాన్య పాఠకులకూ సాధారణ సాహితీ పరులకూ తెలుగు భారతం, ఆది పర్వంలో లభ్యమైనంత సమాచారం మాత్రమే తెలుసు. ఆదిపర్ం పంచమాశ్వాసంలో ౨౩౧వ వచనం నుంచి ౨౫వ పద్యం దాకా పదిహేను గద్య పద్యాలలో నన్నయ్యగారు ఏకలవ్వుని అస్త్ర విద్యాభ్యాసం, పాటవ ప్రదర్శనం, గురుదక్షిణ సమర్పణం తెలియజేశారు. తన శిష్యులలో  ఒకే ఒకణ్ణి అందరి అందరికన్నా మిన్నగా చేయాలని ఇంకొక అసమాన పరాక్రమశాలిని ఆచార్యుడు అంగవికలునిగా చేయడం అనుచితం. అడిగి బొటనవ్రేలు కోసి ఇచ్చిన శిష్యుడు మహోన్నత వ్యక్తి. ఈ ఘట్టం తర్వాత ఏకలవ్యుడు ఏమయ్యాడు? ఈ ప్రశ్నకు తెలుగు భారతంలో జవాబు దొరకదు. భారత కథలో ఎంతో ప్రముఖ పాత్రను వహించకపోతే ఆదిపర్వంలో ఏకలవ్యుని కథను కథనం చేయడం అనవసరం. తెలుగు భారతంలో దొరకదు గానీ వ్యాస భారతంలో ఏకలవ్యుని అట్టు పుట్టు ఆనవాళ్ళన్నీ ఓపికతో గాలించితే చేతినిండా చిక్కుతాయి. నన్నయ్యగారు గానీ, తిక్కన గారు గానీ వ్యాస భారతాన్ని యధామూలంగా అనువదించకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. భారతాని...

అర్ధశతాబ్దపు ఆంధ్రసాహితి

నాకు జ్ఞాపకం ఉన్నంతవరకు ఇంచుమించు ౧౯౧౬ ఆ ప్రాంతాన తెలుగులో మొదటి ఆధునిక పద్యకావ్యం అవతరించినది. ఇది శ్రీ రాయప్రోలు సుబ్బారావు రచన, తృణకంకణము. ఈ రచనలో - నాకు తెలిసినంతవరకు - మొదటి సారిగా మోహానికి బదులు ప్రేమ, కామవాంఛకు బదులు స్నేహము ఇటువంటి భావాలు ప్రకటిత మగుతాయి. అప్పుడు వారికి ఇంచుమించు సమకాలికంగా అబ్బూరి రామకృష్ణారావు, బసవరాజు అప్పారావు, మహాకవి గురజాడ అప్పారావు తమ క్రొత్త నగలతో ఆంధ్రమాతను అలంకరించారు. ఆ రోజులలో అబ్బూరి రామకృష్ణారావు రచించిన పద్యములను ఇంగ్లీషులో పాస్టరల్ పొయట్రీ అనవచ్చును. ఇది అప్పుడు మలకు క్రొత్త. కాపుపాటలో ఆయన అంటారు. ఇలా... ... ప్రేయసి లేచి రమ్ము, చివురించిన మావులక్రింద శీతల చ్ఛాయలలోన యౌవనవసంతశుభోదయ మయ్యె నవ్వుచున్ చేయికిఁ జేయిఁ జేర్చి పరచింతనలన్ మరపించురాగముల్ దీయుచు వాసన ల్పరిమళించెడు చోటులయందుఁ బోవఁగన్ - అని ఈ ధోరణినే లోకముతో మన కేటికి లోలాక్షీ రా పోదము జీవితంపు వంత గూర్చి పాడు ఈ లోకముతో మన కేటికి - అని దూకుడుతో గానము చేసిన బసవరాజు అప్పారావు కవిత క్రమక్రమంగా పరిణతిని చెంది ఆయన పటపత్రశాయిని గురించి ఒంటిగా నుయ్యాల లూగితివా నా ముద్దుకృష్ణా, జంటగా నను పిల్వ ...