తాపీ ధర్మారావు గారి 'సాహితీ మొర్మొరాలు' పుస్తకం నుంచి ఓ వ్యాసం నిజమెంతో అబద్ధమెంతో తెలియదు గానీ , ఒక చిన్న కథ చెప్పుకుంటారు , సంస్కృతసాహిత్యం చదువుకున్నవారు . ఈ సంగతయినా కథగా చెప్పుకోరు . పెద్ద చరిత్రాత్మకమయిన విషయంగా చెప్పుతారు . ఏది ఎలాగున్నా , అది విమర్శకులు వినవలసినదే . కాబట్టి మనవి చేస్తాను . చెప్పుకొనే కథ ధారా నగరమో, ఉజ్జయినీ నగరమో ఏదో నగరము . మహారాజుగారి కొలువుకూటం . పని ముగిసిపోయింది . సాయంకాలం ౪ గంటలవేళ ( ఇప్పటి వాచీల ప్రకారం ) అయింది . ఇద్దరు యువకవులు పని ఏమీ లేక పోవడం చేత అలా షికారు బయలుదేరారు . ఎక్కడికి ? వేశ్యవాటికకు - అంటే భోగం వీధికి . దుష్టచింతతో కాదు . సౌందర్య పిపాసతో . వేశ్యవాటికలు ఆ రోజులలో వేశ్యవాటికలు అంటే యిప్పటి భోగం వీధులలాగా వుండేవి కావు . అప్పటి వేశ్యలూ యిప్పటి భోగంవాళ్ళలాగా వుండేవారు కారు . వేశ్యలు బాగా చదువులలోనూ , సంగీతంలోనూ , కళలలోనూ కౌశలం వున్నవారు . వేశ్య వాటికలకు పోవడం ఆ రోజులలో - ఎందుచేతనో యిప్పటంత హేయంగా వుండేది కాదు . ఆ రోజులలో సాయంకాలం నాలుగు గంటలవేళకు ...
క్షోణితలంబు నెన్నుదురు సోకగ వందనంబు తెలుగు తల్లికి.