ఆదిత్య హృదయము కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి. తి.తి.దే. ప్రచురణ ప్రతిపదార్థం తతః - అనంతరమందు యుద్ధపరిశ్రాంతం - యుద్ధమునందలసి యున్నట్టియు సముపస్థితం - సమీపంగా వచ్చియున్నట్టి రావణంచ - రావణుని గూడ అగ్రతః - ఎదురుగా దృష్ట్వా - చూచి సమరే - యుద్ధమందు చింతయా - చింతతో స్థితం - ఉన్నవాడును ౨. దైవతైశ్చ - దేవతలతో గూడ సమాగమ్యః - కలసికొని రణం - యుద్ధమును దృష్టం - చూచుటకు అభ్యాగతః - సమయానికి వచ్చినటువంటినీ భగవాన్ - త్రికాలజ్ఞుడైన అగస్త్యః - అగస్త్యుడను ఋషిః - మహర్షి ఉపాగమ్యః - దగ్గరకు వచ్చి రామం - రాముని గూర్చి అబ్రవీత్ - పలికెను ౩. వత్స - కుమారా మహాబాహో - దీర్ఘమైన భుజాలు గలవాడా యేన - ఏ స్త్రోత్రము చేత సర్వాన్ - సమస్తమైన అరీ౯ - శత్రువులను సమరే - యుద్ధమందు విజయిష్యసి - జయింపగలవో తం - అటువంటి సనాతనం - నిత్యమైనదియు గుహ్యం - రహస్యమైనదియు నగు శృణు - వినుము ౪. ఆదిత్య హృదయం - ఆదిత్య హృదయమను స్త్రోత్రము పుణ్యం - పుణ్యమును గలుగ జేయును సర్వశత్రు వినాశనం - సమస్త శత్రువులను నాశనం జేయునది జయావహం - జయకరమైనది అక్షయం - నాశరహితమై నదియు పరమం - ఉత్కృష్టమైన శివం...
క్షోణితలంబు నెన్నుదురు సోకగ వందనంబు తెలుగు తల్లికి.