అమరావతి పేరు విన్నంతనే ప్రతి ఆంధ్రుని హృదయముకూడ ఉప్పొంగి పోవును; ప్రతి భక్తుని చిత్తము గూడ భక్తితో తన్మయమగును. ప్రాచీనకాలపు విజ్ఞాన వైభవమునకు, శిల్పకళా ప్రాభవమునకు, అఖండ బౌద్ధ సంస్కృతికి గురుపీఠమై దేశదేశాంతరములలో నాగరికతా దీప్తులను ప్రసరింపజేసిన అమరావతి ఆంధ్రులకే కాదు, భారతీయులందరికిని ఆరాధింప దగిన పవిత్రస్థానము; స్మరింపదగిన చారిత్రక ప్రదేశము. శాతవాహన రాజులు మగధ నుండి కన్యాకుమారిదాక దక్షిణాపథమును పాలించెడి రోజులలో కృష్ణానది యొడ్డున నున్న ధాన్యకటకము దక్షిణదేశపు నగరములకన్నింటికిని తలపూవై ప్రకాశించినది... పూర్తి పుస్తకం కోసం అమరావతి క్లిక్ చేయండి.
క్షోణితలంబు నెన్నుదురు సోకగ వందనంబు తెలుగు తల్లికి.