ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

నా దేశము

నా దేశం

తెలుగుదేశమే నాది
తెలుగుబిడ్డనే నేను
తెలుగు పేరు వింటేనే మురిసిపోతాను
తెలుగుభాష అంటే మైమచిపోతాను.

నన్నయభట్టిక్కడనే పుట్టినాడు
తిక్కనకవి గంటమిచట పట్టినాడు
పోతన్నలు, శ్రీనాథులు,
రామరాజ భూషణులు
తెలుగుభాషకే వన్నెలు దిద్దినారూ
తెలుగుజాతి నాల్కలపై నిలిచినారు.

ఆట వెలదులను ముద్దుల
మూటగట్టె వేమన్న
భావ కాలగతుల తెలియ
బల్కెను వీరబ్రహ్మం
కర్నాటక గానానికె, కళదెచ్చెను త్యాగరాజు,
ఇంతటి విజ్ఞానధనులు
ఎవరున్నారు
వెదకిచూచినాగాని కానరారూ.

బరిపై తొడగొట్టి, కత్తి
బట్టెను నాయకురాలు,
పురుష వేషమున శత్రువు
నురుమాడెను రుద్రమ్మ,
పురుష వేషమున శత్రుల
నురుమాడెను రుద్రమ్మ,
మొల్లలు మల్లమదేవులు,
మహిళలకే మణిపూసలు,
తెలుగుగడ్డకే, పేరు దెచ్చినారు
స్త్రీ జాతికి గౌరవమ్ము నిచ్చినారు.

ఓరుగల్లు నేలిన శూరుడు ప్రతాపరుద్రుడు
పౌరుషమ్ము చిందించిన బాలచంద్రుడు
రాచకొండ వెలమ దొరలు
కొండవీటి రెడ్డి విభులు
మన ప్రతాపమునకు బలే మచ్చుతునకలు
వేడినెత్రు పారించిన వీరపుత్రులు

కలియు భీముడని బిరుదు
గొన్న, "కోడెరామమూర్తి"
అద్భతమేధావిగ, పే
రందిన "విశ్వేశ్వరయ్య"
జగము మెచ్చు "రాధాకృష్ణ"
త్యాగమూర్తి "ప్రకాశం"
"సత్యశాయి బాబాలు"

సింహాచలమప్పన్నా, శ్రీశైలం మల్లన్నా,
యాదగిరి నరసింహా, ఏడుకొండల వంకన్నాః
వీరంతా తెలుగువారి కిలవేలుపులు,
మహిమలు జూపించునట్టి మనదేవుళ్ళూ

కృష్ణా, గోదావరులు, కేరింతలు గొడుతున్నవి,
తుంగభద్ర మంజీరలు, అంగలు వేస్తున్నవి,
నిత్యము ప్రవహించుచున్న
నిర్మలమగు జీవనదులు,
బంగారపు పంటలు పండిస్తువున్నవీ
కరవు రక్కసిని దూరం తరుముతున్నవీ.

తెలుగువాడు ఏడనున్న, తెలుగువాడు
తెలుగుభాషనే, సొంపుగా పలుకుతాడు
మరచిపోని అతని కట్టు,
మారిపోని అతని బొట్టు
తలచుకొన్న, రోమరోమం
పులకరిస్తుందీ,
అభిమానం పొంగిపొరలి,
ఉరకలేస్తుందీ.
శ్రీ కొసరాజు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గిజిగాడు

జిలుగుం బంగరు రంగులం గులుకు మేల్చిన్నారి పూగుత్తి సొ మ్ములు గీలించిని తుమ్మగొమ్మలకు, నీవు న్నీ సతీరత్న మూ యెల గీమున్ దగిలించి రేఁబవలు హాయిందూఁగరా గాడ్పు బి డ్డలు మీ కూడిగ మాచరింప, గిజిగాఁడా నీకు దీర్ఘాయువౌ! తేలిక గడ్డి పోచఁలను దెచ్చి, రచించెద వీవు తూఁగటు య్యేల గృహంబు, మాలవుల కేరికి సాధ్యముగాదు, దానిలో జాలరు, లందులో జిలుఁగు శయ్యలు నంతిపురంబు లొప్పగా మేలు భళీ! పులుంగుటెకిమీడవురా గిజిగాఁడ? నీడజా! కులుకు పసిండినిగ్గుల దుకూలములన్ ధరియించి ముద్దు బి డ్డలును, బడంతి నీ పొదిగిట న్ని దురింపఁగఁ గన్నెగాడ్పు లూ యెల సదనంబుఁలూచ, భయమింత యెరుంగక కన్నుమూయు నీ యలఘు సుఖంబు మాకుఁ గలదా! గిజిగా? యొక ఱేని కున్నదా? అందమున నీకు నీడగు నందగాడు గృహవినిర్మాణమున నిన్ను గెలుచువాడు వైభవంబునఁ బోలు దేవతల ఱేఁడు లేఁడురా గి జిగా! మొనగాఁడ వోయి నీ గిజిగాని నామకము, నీ తెలివిం బ్రకటించు గూడు, నీ మైఁగల సోయగం బవని మానవకోటికి ముద్దుసేయు నో యీ! గిజిగాడ! భీతిలకు! నీవు ధరాతలి నున్న బిట్టుగా వాగెడు నాస్తికు ల్తలు వంతు రనంతుని చెంత ఖిన్నులై.

తెలుగు భాష తీపిదనం

సి.వేదవతి గారి పుస్తకం 'తెలుగు-వెలుగు' నుంచి. "మహిమున్ వాగను శాసనుండు సృజియంపం గుండలీంద్రుండు దన్ మహనీయస్థితి మూలమై నిలువ శ్రీనాథుండు ప్రోవన్ మహా మహులై సోముడు భాస్కరుండు వెలయింపన్ సొంపు పాటించు నీ బహుళాంధ్రోక్తిమయ ప్రపంచమున తత్ప్రాగల్భ్య మూహించెదన్."                                                                                                    - రామరాజ భూషణుడు. వేయి ఏళ్ళుగా తెలుగుజాతి వేయి విధాలుగా పండించుకొన్న సజీవ భాష తెలుగు భాష. ఆంధ్రభాష అమృతం వంటిదనీ, దేశ భాషలలో ఎన్నికను గడించిందనీ అనటానికి...

హనుమత్ కవచం

శ్రీ పంచముఖీ హనుమత్ కవచమ్ ఓం అస్య శ్రీ పంచముఖీ వీర హనుమత్ కవచ స్తోత్త్ర మహా మంత్రస్య బ్రహ్మఋషి:గాయత్రీ చ్ఛంద: శ్రీ రామచంద్రో దేవతా రామ్ బీజం మం శక్తి: ఇతి కీలకం శ్రీ రామచంద్ర ప్రసాద సిద్ధ్యర్ధే పంచముఖీ వీర హనుమత్ కవచ స్తోత్త్ర మంత్ర జపే వినియోగ: రాం అంగుష్ఠాభ్యాం నమ:, రీం తర్జనీభ్యాం నమ: రూ మథ్యమభ్యాం నమ: రై: అనామికాభ్యాం నమ: రౌం కనిష్ఠకాభ్యాం నమ: రం కరతల కర పృష్ఠాభ్యాం నమ: రాం హృదయాయ నమ: రీం శిరసే స్వాహా, రూం శిఖాయై వషట్ రైం కవచాయ హుం రౌం నేత్రత్రయాయ వౌషట్ అస్త్రాయ, ఫట్ భూర్భువ స్సువరోమితి దిగ్బంధ: ధ్యానం వందే వానర నారసింహ ఖగరాట్ క్రోఢాశ్వ వక్త్రాం చితం నానాలంకరణం, త్రిపంచ నయనం, దేదీప్యమానం రుచా || హస్తాబ్జై అర సిఖైట పుస్తక సుధా కుంభాం కుశాద్రీన్ గదాం ఖట్వాంగం ఫణి భూరుహౌ దశ భుజం సర్వారి గర్వాపహమ్ అథ ధ్యానం ప్రవక్ష్యామి శ్రుణు పార్వతి యత్నత: మద్వ్రతం దేవదేవస్య ధ్యానం హనుమంత: పరం పంచవక్త్రం మహాభీమం త్రిపంచ నయనైర్యుతం దశబిర్బాహుభిర్యుక్తం సర్వకామ్యార్ధ సిద్ధిదమ్ పూర్వేతు వానరం వక్త్రం హృదయం సూర్య సన్నిభం దంష్ట్రా కరాళ వదనం భ్రుకుటీ కుటిలోద్భవమ్ అన్యైకం దక్షిణం ...