ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

భాషలో - తమాషాలు - ౧

ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి గారి పుస్తకం నుంచి


"మేష్టారూ! ఈ తెలుగు వాక్యాలు ఎంత "చెవికిం(కం)పుగా" ఉన్నాయో చిత్తగించండి -
౧. మద్యము సేవించువారు తమ శరీరములో పోషక పదార్థాల లేమిని కలిగియుందురు.
౨. స్పీకరు సభ్యునితో ప్రమాణము చేయించెను.
౩. ఈ కమిటీచే మంత్రులు ఎన్నుకొనబడగూడదు.
౪. మన దేశమును ఆంధ్రమని పిలుతురు
౫. ఈ సభలో మాతో సహకరించి నిశ్శబ్దముగా కూర్చుండుడు.
౬. నిన్న బజారులో ఎవనిని చూచితినో వాడే నేడు మా యింటివద్ద ప్రత్యక్షమైనాడు.

వ్యాకరణరీత్యా చూస్తే పై వాక్యాలలో ఏమీ తప్పున్నట్టు కనబడదు. కాని, అందులో ఏదో ఒక జీవలక్షణం లోపించి ఎబ్బెట్టుగా ఉన్నట్టుంది. లోపం ఎక్కడ ఉందంటారు.?"

"జగన్నాథం ! నీ ఆవేదన నా కర్థమయింది. వాక్యంలో ఏవైనా అపశబ్దాలుంటే - అవి పొరపాటుగా వచ్చాయనో, సరియైన పరిజ్ఞానం లేక పడ్డాయనో అనం సరిపెట్టుకోవచ్చు. తిరిగి సరిచూచుకొని దిద్దుకోవచ్చు. కాని నీ చెవికి కటువుగా వినిపించినవి అపశబ్దాలు కావు, అపవాక్యాలు!

ఒక దేశీయుడు పలికే వాక్యానికి ఒక జీవలక్షణం వుంటుంది. అతడు వాక్యం కూర్చేతీరు, విభక్తి అతికే విధం, పలికించే కాకువు, ఒక ప్రత్యేక లక్షణంతో వుంటుంది. దానినే నుడికారం, జాతీయం, వాక్సంప్రదాయం అంటారు. అవి లోపించినప్పుడు నువ్వు ఎన్ని సాధుశబ్దాలను ప్రయోగించి వాక్యం నిర్మించినా సహజంగా వినిపించక ఎరువు సొమ్ములా, పరాయి భాషలా కనబడుతుంది. తెలిగించామనుకున్న బైబిలు, సువార్తలు మొదలైన పుస్తకాలలోని సూక్తులు, తెలుగు వారికి సరిగ్గా అందకపోవడానికి కారణం, ఆ తెలుగు తెలుగు కాకపోవడమే. పైగా ఆ వాక్యాలు అపహాస్యానికి ఉదాహరణంగా ఉపయోగించాయి కాని, ఉద్దేశించిన ప్రయోజనాన్ని నెరవేర్చలేకపోయాయి.

ఆ కథలనే, సందేశాలనే, చలంగారు వ్రాస్తే, సూక్తులుగా తెలిగిస్తే, దానికి సాహిత్యపు విలువ వచ్చి చాలామంది ఆప్యాయంగా చదివారు.
ఈ తెలుగు భాష జీవధర్మాన్నే - నన్నయగారు 'తెలుగున రచియించుట' అన్నా - తిక్కనగారు తెలుగుబాస వినిర్మించుట అన్నా - శ్రీనాథుడు నుడికారము సొంపెనలార అన్నా - చేమకూర వెంకన్న జాతి వార్త అన్నా - ఒక్కటే విషయాన్ని నొక్కి నొక్కి చెప్పినట్టయింది. ఈ ఎఱుకలేని ఆధునికులు అనువాదాలు చేశారుకాని, తెనుగు చెయ్యలేకపోయారు. కనుకనే ఆధనికయుగంలో 'అనువాదాలు' గా వచ్చిన చాల సంస్కృత కావ్యనాటకాలు నామరూపాలు లేకుండా పోయాయి. ఈ విషయాన్ని నీకు పూర్వ, ఆధునిక రచయతలనుంచి, ఎన్నైనా ఉదాహరణలు చూపి వివరించవచ్చు కాని, ఇది చోటకాదు. వేరొక సందర్భం అందకు వినియోగించుకుందాం.

ప్రస్తుతం నీవు ఉదాహరించిన వాక్యాల్లో లోటు ఎక్కడుందో చూద్దాం. ఈ నాడు విద్యావంతులు అంటే ఎక్కువమంది ఇంగ్లీషు చదవుకున్నవారే గనక వారికి ఇంగ్లీషు నిర్మాణంతో ఉన్న గాఢ పరిచయం తెలుగు భాషతో ఉండదు, కనుక ఇంగ్లీషలో ఆలోచించి తెలుగులో వ్రాస్తారు. ఆ విధంగా ఈనాడు ఇంగ్లీషు ప్రభావం తెలుగు మీద పడ్డట్టు పూర్వం సంస్కృత ప్రభావం తెలుగుమీద అపారంగా పడింది. ఇప్పటికే కొందరు సంస్కృత పండితులు మాట్లాడితే తెలుగులా ఉండదు.

అయితే సంస్కృతంతో ఉన్న గాఢ అనుబంధం వల్ల తెలుగు, సంస్కృతాన్ని ఏదోవిధంగా ఇముడ్చుకుంటుంది. కానైతే కృతకమైనచోట లోటు కనబడుతూనే వుంటుంది.

నీ వాక్యాల్లో ఇంగ్లీషు నుడికారం వుండడంవల్ల అవి తెలుగు వాక్యాలు అనిపించకుండా పోయాయి.

౧. 'లేమిని కలిగివుండడం' అనేది Have అనే క్రియ తెచ్చిన వికృత స్వరూపం. 'పోషక పదార్థాలను పోగొట్టలుకొందురు' అంటే సరిపోతుందిగదా.

౨. 'సభ్యునితో ప్రమాణం చేయించడం' అని ఎవరూ వాడుక చెయ్యరు. 'సభ్యునిచే ప్రమాణం' అన్నది సరైన కారకం. సరియైన విభక్తితో క్రియను కలివి వాడడమే కారకం అంటే - అది తెలియకపోతే కృతకమైన వాక్యం ఏర్పడుతుంది.

౩. ఇక్కడు 'బడు' అన్నది కర్మణి ప్రయోగం. అది తెలుగుకు సహజం కాదు. ఏ తెలుగువాడూ తన ప్రసంగంలో 'బడు' వాడడు. ఇది సంస్కృతం వల్ల, ఇంగ్లీషువల్ల, తెలుగులో ఎక్కువ దురాక్రమణ చేస్తోంది. దీన్ని సాధారణంగా పరిహరించడం మంచిది.

౪. ఇందలి 'పిలుచుట' మనది కాదు. 'ఆంధ్రం అంటారు' అనడం సహజం. ఇది Called అనే ఇంగ్లీషు క్రియ యొక్క అజీర్ణ స్వరూపం. దీనికి లోబడిన పండితులు కూడా వున్నారు.

౫. 'మాతో సహకరించడం' అన్నది ఇంగ్లీషులో ఆలోచించి తెలుగులో అనడం. 'మాకు తోడ్పడండి' అనడం యుక్తం.

౬. 'ఎవడో-వాడు' అనడం తెనుగు సంప్రదాయం కాదు. సంబంధ సర్వనామం తెలుగులో వాడరు. ఇది సంస్కృతం నుంచీ ఇంగ్లీషు నుచీ తెలుగులోకి దిగమతి అయింది. పూర్వాంధ్రకవులు(పోతన వగైరా) కొందరు సంస్కృత వాసనతో వాడినా అది పద్యకవితకే పరిమితం - అని ఎంచి ఆధునిక రచయిత లుపేక్షించినారు. ఈ Relative pronoun ను పరిహరించడం కోసమే బాల వ్యాకరణం సమాస పరిచ్చేదంలో 'కర్మాదులకు ప్రాధన్నయా వివక్ష యందు...' అనే సూత్రం పుట్టింది. 'ఎక్కిన చెట్టు, తిన్న విస్తరి, విడిచిన అడవి' వంటి ప్రయోగాలు కేవలం తెలుగు జాతీయాలు; కాబట్టి 'నిన్న బజారులో చూచిన వాడే నేడు మా ఇంటికి వచ్చినాడు' అనడం సరియైన తెలుగు వాక్యం.


ఈ నుడికారమే భాషకు ప్రాణం.

"అమృతమైనను చవుల జాత్యన్న సమమె ?" (రాయలవారు.)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గిజిగాడు

జిలుగుం బంగరు రంగులం గులుకు మేల్చిన్నారి పూగుత్తి సొ మ్ములు గీలించిని తుమ్మగొమ్మలకు, నీవు న్నీ సతీరత్న మూ యెల గీమున్ దగిలించి రేఁబవలు హాయిందూఁగరా గాడ్పు బి డ్డలు మీ కూడిగ మాచరింప, గిజిగాఁడా నీకు దీర్ఘాయువౌ! తేలిక గడ్డి పోచఁలను దెచ్చి, రచించెద వీవు తూఁగటు య్యేల గృహంబు, మాలవుల కేరికి సాధ్యముగాదు, దానిలో జాలరు, లందులో జిలుఁగు శయ్యలు నంతిపురంబు లొప్పగా మేలు భళీ! పులుంగుటెకిమీడవురా గిజిగాఁడ? నీడజా! కులుకు పసిండినిగ్గుల దుకూలములన్ ధరియించి ముద్దు బి డ్డలును, బడంతి నీ పొదిగిట న్ని దురింపఁగఁ గన్నెగాడ్పు లూ యెల సదనంబుఁలూచ, భయమింత యెరుంగక కన్నుమూయు నీ యలఘు సుఖంబు మాకుఁ గలదా! గిజిగా? యొక ఱేని కున్నదా? అందమున నీకు నీడగు నందగాడు గృహవినిర్మాణమున నిన్ను గెలుచువాడు వైభవంబునఁ బోలు దేవతల ఱేఁడు లేఁడురా గి జిగా! మొనగాఁడ వోయి నీ గిజిగాని నామకము, నీ తెలివిం బ్రకటించు గూడు, నీ మైఁగల సోయగం బవని మానవకోటికి ముద్దుసేయు నో యీ! గిజిగాడ! భీతిలకు! నీవు ధరాతలి నున్న బిట్టుగా వాగెడు నాస్తికు ల్తలు వంతు రనంతుని చెంత ఖిన్నులై.

పాత పుస్తకాలు - డౌన్లోడ్ చేసుకోవటం - Digital Library of India

మొదట  Downloader-NEW ( Downloader-OLD )ని డౌన్లోడ్ చేసుకోండి. ఇంతకు ముందే Downloader-OLD డౌన్లోడ్ చేసుకున్నట్లయితే  update(NEW) కోసం Update(12-09-10) click చెయ్యండి.  Unzip చెయ్యండి. runDM.bat file ని run చెయ్యండి. 'chandamama' option select చేయండి. 'Download Location' field లో మీరు ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ ఇవ్వండి like C:\ లేదా 'Browse' Button click చేసి  location select చేసుకోండి. 'Year','Month' select చేసుకొని 'download' button click చెయ్యండి. ఒక్కో పేజి download అయిన తర్వాత ఇది ఒకే pdf file గా కలుపుతుంది(with year-month name). -------------------------------------------  1st Picture లో 'Digital Library ' select చేసుకుంటే Digital Library of India నుంచి పుస్తకాలు డౌన్లోడ్ చేసుకోవచ్చు. 'http://www.new.dli.ernet.in/'   లో పుస్తకం వెతికి URL తెచ్చుకొని, దాన్ని 'URL' field లో paste చేసి 'add to download ' button click చెయ్యండి. తర్వాత 'd

హనుమత్ కవచం

శ్రీ పంచముఖీ హనుమత్ కవచమ్ ఓం అస్య శ్రీ పంచముఖీ వీర హనుమత్ కవచ స్తోత్త్ర మహా మంత్రస్య బ్రహ్మఋషి:గాయత్రీ చ్ఛంద: శ్రీ రామచంద్రో దేవతా రామ్ బీజం మం శక్తి: ఇతి కీలకం శ్రీ రామచంద్ర ప్రసాద సిద్ధ్యర్ధే పంచముఖీ వీర హనుమత్ కవచ స్తోత్త్ర మంత్ర జపే వినియోగ: రాం అంగుష్ఠాభ్యాం నమ:, రీం తర్జనీభ్యాం నమ: రూ మథ్యమభ్యాం నమ: రై: అనామికాభ్యాం నమ: రౌం కనిష్ఠకాభ్యాం నమ: రం కరతల కర పృష్ఠాభ్యాం నమ: రాం హృదయాయ నమ: రీం శిరసే స్వాహా, రూం శిఖాయై వషట్ రైం కవచాయ హుం రౌం నేత్రత్రయాయ వౌషట్ అస్త్రాయ, ఫట్ భూర్భువ స్సువరోమితి దిగ్బంధ: ధ్యానం వందే వానర నారసింహ ఖగరాట్ క్రోఢాశ్వ వక్త్రాం చితం నానాలంకరణం, త్రిపంచ నయనం, దేదీప్యమానం రుచా || హస్తాబ్జై అర సిఖైట పుస్తక సుధా కుంభాం కుశాద్రీన్ గదాం ఖట్వాంగం ఫణి భూరుహౌ దశ భుజం సర్వారి గర్వాపహమ్ అథ ధ్యానం ప్రవక్ష్యామి శ్రుణు పార్వతి యత్నత: మద్వ్రతం దేవదేవస్య ధ్యానం హనుమంత: పరం పంచవక్త్రం మహాభీమం త్రిపంచ నయనైర్యుతం దశబిర్బాహుభిర్యుక్తం సర్వకామ్యార్ధ సిద్ధిదమ్ పూర్వేతు వానరం వక్త్రం హృదయం సూర్య సన్నిభం దంష్ట్రా కరాళ వదనం భ్రుకుటీ కుటిలోద్భవమ్ అన్యైకం దక్షిణం