"చాలా సేపట్నుంచీ చూస్తున్నాను. అతను - ఆ పక్కకూ, ఈ పక్కకూ తిరుగుతున్నాడు. పైకీ కిందికీ గెంతుతున్నాడు. ఎవరన్నా తరుముతున్నారేమో, ప్రాణభయంతో అలా చేస్తున్నాడనుకోడానికయినా, ఇక్కడెవ్వరూ లేరు. పోనీ - పిచ్చివాడనుకొందామన్నా, అలా కనిపించడం లేదు. అవును గదూ?" అన్నదో పూవు అతని వేపే చూస్తూ.
"అతన్నెవరూ తరమడం లేదు. అతను ఉన్మత్తుడూ కాదు. అల్లంత దూరంలో, ఎవరి కోసమో ఎదురు చూస్తోన్న, ఆ సుందరమ్మ గారి దృష్టిలో పడాలని అతని తాపత్రయం!" అన్నదో తూనీగ.
"అని - మీకెలా తెలుసు?" అన్నదా పూవు.
"స్వానుభవం. ఇందాకణ్నించీ నేనూ అల్లాగే చేశాను; నీ దృష్టిలో పడాలని!" అన్నదా తూనీగ, ఆ పూవమ్మకు దగ్గరగా జరుగుతూ.
*************
"నువ్వెదు కొచ్చావమ్మా? నిన్ను పిలవలేదే!" అన్నాడతను విసుగ్గా.
"మరీ - వొంటరిగా ఉన్నారనీ" అన్నదా నిద్ర. అతని పక్కనే చతికిల బడుతూ.
*************
"ఉదయం నిన్ను చూసినప్పుడు, నాకు జాలి వేసింది. ఆకులన్నీ రాలీపోయాయి. రెమ్మలు, కొమ్మలు ఎండిపోయాయి. ఇవ్వాళో, రేపో, నిన్ను తొలగించుతారని బాధపడ్డాను". ఇప్పుడు చూస్తుంటే, నాకే ఆశ్చర్యమేస్తున్నది. 'నీవు నీవేనా? నేను నేనేనా?' అనిపిస్తున్నది. ఇలా పచ్చగిల్లి పోయావేం? నీ రెమ్మలు, కొమ్మలు, నవ నవ లాడుతున్నాయెందుకని?" అన్నదా ఉడత.
"ఎదురింట్లోకి ఈ ఉదయమే ఎవరో అద్దెకొచ్చారు. ఓ పెద్దాయన మనవరాలు నా దగ్గరకొచ్చింది. నన్ను పలకరించింది. పాదు చేసి కాసిని నీళ్ళు పోసింది. ఆ బంగారు తల్లి పేరు వసంత..." అన్నదా చెట్టు.
*************
"ముందుగా వొచ్చినతను వ్యాపారి. తుంపుకెళ్ళి, అరకాసుకో, కాసుకో, నా బిడ్డలను అమ్ముకుంటాడు. ఈ అమ్మగారు కూడా, నా బిడ్డలను తుంపుకెడతారు; ప్రభువు పాదాల ముందుంచడానికి" అన్నదా పూలచెట్టు.
*************
మీరు - అదృష్టవంతులు.
"ఎవరు మీ గురువు?" లని అడిగితే అయిదారుగురు పేర్లు చెబుతారు. కాదూ కూడదనుకొంటే - ఓ పాతిక మంది పేర్లు చెబుతారు.
ఇదే ప్రశ్న నన్నడిగితే మాత్రం, నేను చాలా ఇరుకున పడతాను.
"చిన్న చీమ లగాయతు, చిరతానంద స్వామి దాకా అందరూ నాకు గురువులే!" నని చెప్పవలసి వస్తుంది.
*************
"ఇదేమిటి కన్నా! ఇక్కడ ఇంతలా బొప్పికట్టిందేం ?" అన్నాడతను, ముని వేళ్ళతో నిమురుతూ.
"నేను ఏమరుపాటుగా ఉన్నప్పుడు, ఓ చిన్న శబ్దమొచ్చి మెత్తగా నన్ను తాకింది" అన్నదా నిశ్శబ్దం!

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి