భారతదేశము చిన్న చిన్న స్వతంత్ర రాజ్యములుగానుండి రాజుల ఏలుబడి యందుండెను. దక్షిణ భారతదేశ ప్రాంతమున "మంధోటి" యను పట్టణనము రాజధానిగా గల ఒక స్వతంత్ర రాజ్యమున కొన్ని అనివార్య కారణమువలన రాజులేని కారణమున అరాజకమేర్పడి సమర్ధులగు వారసులెవ్వరును లేని కారణమున పరిపాలనా దక్షుని ఎన్నికకై రాజ శాసనముననుసరించి రాజవంశ పూర్వాచార ప్రకారము, కఠినమగు యుక్తితో గూడిన నియమము నొకదానినినేర్పటు జేసి, ఆ పోటీలో గెల్చినవారికి రాజ్యాధికారము కలుగునని రాజ్యము నలుమూలల చాటింపు గావించి ఆ రాజ్యమునకు తగిన రాజుకొరకు రాజప్రతినిధులు వెదకుచుండిరి... అది ఒక కుగ్రామము. గ్రామచావిడికి ప్రక్కగా శిల్పి బ్రహ్మయ్యాచార్యులవారి "అగ్నిశాల" కలదు. బ్రహ్మయ్యాచార్యులు పంచమవేదమైన ప్రణవవేద అధ్యయనమొనర్చిన ఓంకారోపాసకుడు. సకల ఆగమ శాస్త్రకోవిదుడు, పంచశిల్ప ప్రవీణుడు అయిన శిల్పాచార్య బ్రహ్మయ్యాఁచార్యులు తమ పెద్దలవద్ద నేర్చుకొన్న కులవృత్తిచే "అగ్నిశాల" యందు గ్రామవాసుల కవసరమైన పార, కర్రు, కాడి, మేడి, చెంబు, చెరవ, నగ నట్రలు మొదలగు సకల జనోపయోగ నిత్యావసర వస్తువుల తయారు చేసి గ్రామస్తులకు సకాలమున నందించి తన "జగద్గురు వంశ...
క్షోణితలంబు నెన్నుదురు సోకగ వందనంబు తెలుగు తల్లికి.