కొండూరి వారిచే అద్భుతముగా తీర్చి దిద్దబడిన చారిత్రాత్మక నవల ఇది.
సాహితీ సమరాంగణ సార్వభౌముడైన శ్రీ కృష్ణదేవరాయల పుత్రిక తిరుమలాంబ. ఆమెను రాయలు మోహనాంగి యను ముద్దుపేరున పిలుచుకొనువాడు.
మోహనాంగి సంగీత సాహిత్యములందు అపర సరస్వతి;చిత్ర కళానిధి; మారీచీపరిణయమును వ్రాసిన మహాకవయిత్రి. అరవీటి రామరాజునకు అర్ధాంగియైన సాధ్వీతిలకము.
మోహనాంగీ రామరాజులను నాయికా నాయకులనుగా వరించిన చరిత్రాత్మకమగు నవల యిది. అయినను మోహనాంగి కథకే ప్రాధాన్యమెక్కువ.
పూర్తి పుస్తకం కోసం మోహనాంగి క్లిక్ చేయండి.
Digital Library of India వారి సౌజన్యంతో (http://www.new.dli.ernet.in/)
నేను తెలుగురచయిత్రులమీద వ్యాసం రాసినప్పుడు, ఆచార్య నాయని కృష్ణకుమారిగారివంటి ప్రముఖ సాహితీవేత్తలు కృష్ణదేవరాయలుకి అసలు పుత్రిక వున్నట్టు నిదర్శనాలు లేవు అన్నారు. మీకు ఈవిషయంలో ఇంకా ఏమైనా తెలిస్తే చెప్పగలరు. మోహనాంగి నవల సేవ్ చేసుకున్నాను. చదివినతరవాత మళ్లీ కనిపిస్తాను. ఈపోస్టుకి చాలా చాలా కృతజ్ఞతలు.
రిప్లయితొలగించండినమస్కారం అమ్మా,
రిప్లయితొలగించండినాకైతే ఈ విషయం లో ఏమీ తెలియదు.
కొండూరి వారి గురించి మీకు తెలిసే ఉంటుంది.
వారు దీని మీద పరిశోధన చేసిన తర్వాతే, ఈ నవల వ్రాసి ఉంటారు.
వారి గురించి
http://naprapamcham.blogspot.com/2008/02/7.html
మీ వ్యాఖ్య కోసం చూస్తుంటాను.