ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

జనవరి, 2009లోని పోస్ట్‌లను చూపుతోంది

దశావతారములు - జీవ పరిణామ క్రమము (పోలిక)

మత్స్యావతారము - చేవ (జల చరము) కూర్మావతారము - తాబేలు(ఉభయ చరము) వరాహావతారము - పంది(భూచరము) జీవం జలభాగం నుంచి అభివృద్ధి చెందింది అని నేటి శాస్త్ర పరిశోధనలు చెపుతున్నాయి. ఆ తర్వాత అవి నీటి లోను, భూమి మీద సంచరించేవి. చివరి దశలో పూర్తిగా భూమి మీద సంచరించటం నేర్చుకున్నాయి. మన పురాణాలలో వివరించిన అవతారాలలో ఈ విషయమే చెప్పారు.

కాలం

కరిగిపోయే కాలంలో కలగా చెరిగిపోక కనీవినీ ఎరుగని చరిత్ర సృష్టించు. కత్తైనా, కలమైనా కాలాన్ని ఆపలేవు కాని కలకాలం నిలవగలవు.

అర్ధశతాబ్దపు ఆంధ్రసాహితి

నాకు జ్ఞాపకం ఉన్నంతవరకు ఇంచుమించు ౧౯౧౬ ఆ ప్రాంతాన తెలుగులో మొదటి ఆధునిక పద్యకావ్యం అవతరించినది. ఇది శ్రీ రాయప్రోలు సుబ్బారావు రచన, తృణకంకణము. ఈ రచనలో - నాకు తెలిసినంతవరకు - మొదటి సారిగా మోహానికి బదులు ప్రేమ, కామవాంఛకు బదులు స్నేహము ఇటువంటి భావాలు ప్రకటిత మగుతాయి. అప్పుడు వారికి ఇంచుమించు సమకాలికంగా అబ్బూరి రామకృష్ణారావు, బసవరాజు అప్పారావు, మహాకవి గురజాడ అప్పారావు తమ క్రొత్త నగలతో ఆంధ్రమాతను అలంకరించారు. ఆ రోజులలో అబ్బూరి రామకృష్ణారావు రచించిన పద్యములను ఇంగ్లీషులో పాస్టరల్ పొయట్రీ అనవచ్చును. ఇది అప్పుడు మలకు క్రొత్త. కాపుపాటలో ఆయన అంటారు. ఇలా... ... ప్రేయసి లేచి రమ్ము, చివురించిన మావులక్రింద శీతల చ్ఛాయలలోన యౌవనవసంతశుభోదయ మయ్యె నవ్వుచున్ చేయికిఁ జేయిఁ జేర్చి పరచింతనలన్ మరపించురాగముల్ దీయుచు వాసన ల్పరిమళించెడు చోటులయందుఁ బోవఁగన్ - అని ఈ ధోరణినే లోకముతో మన కేటికి లోలాక్షీ రా పోదము జీవితంపు వంత గూర్చి పాడు ఈ లోకముతో మన కేటికి - అని దూకుడుతో గానము చేసిన బసవరాజు అప్పారావు కవిత క్రమక్రమంగా పరిణతిని చెంది ఆయన పటపత్రశాయిని గురించి ఒంటిగా నుయ్యాల లూగితివా నా ముద్దుకృష్ణా, జంటగా నను పిల్వ

పోతన్న కవిత్వ పటుత్వం

తాపీ ధర్మారావు గారి 'సాహితీ మొర్మొరాలు' పుస్తకం నుంచి ఓ వ్యాసం. వామనావతార ఘట్టములో పోతన్న చూపిన కవిత్వ పటత్వము అసాధారణము. ఆ ఘట్టాన్ని అంత సమర్ధతతో చిత్రించగల కవులు ఒకరిద్దరికి మించి ఉండరు. బలిచక్రవర్తి దానాన్ని గ్రహించి, వామనుడు త్రివిక్రముడై బ్రహ్మాండం నిండిపోతాడు. వటు డింతింతై మరింతయి పెరిగిపోతూండడం పోతన్న హృదయానికి ప్రత్యక్షంగా కనిపిస్తూంది. ఆ విధంగానే పాఠకునికి గూడా కనబడాలి గదా ఆ బ్రహ్మాండత్వం పాఠకునికి ప్రస్ఫుటం కావాలి గదా అలా జరిగినప్పుడే కదా ఆ రసం పలికినట్టవుతుంది ఇంతింతై వటు డింతయై మరియు దా నింతై , తోయదమండలాగ్రమున క ల్లంతై, చంద్రుని కంతయై, ధ్రువునిపై నంతై, మహార్వాటిపై నంతై, సత్యపదోన్నతుం డగుచు బ్ర హ్మాండాంత సంవర్ధియై అని వర్ణించాడు. ఆకాశవీధి, మేఘమండలము, కాంతిరాశి, చంద్రుడు, ధ్రువుడు, మహర్వాటి, సత్యపదమూ అని ఆ రూపాన్ని పెంచాడు. కాని - ఆ బ్రహ్మాండత్వం పాఠకులకు కరతలామలకంగా కనిపించిందా ఆ మహాద్భుతాకార మెంత పెద్దదో కంటికి కట్టినట్టయిందా తృప్తి లేదు. కాబట్టే రవిబింబం బుపమింప బాత్రమగు ఛ త్రంబై, శిరోరత్నమై, శ్రవణాలంకృతియై, గళాభరణమై, సౌవర్ణ కేయూరమై, ఛవిమత్కంకణమై,

ఆదిత్య హృదయము

ఆదిత్య హృదయము కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి.   తి.తి.దే. ప్రచురణ ప్రతిపదార్థం తతః - అనంతరమందు యుద్ధపరిశ్రాంతం - యుద్ధమునందలసి యున్నట్టియు సముపస్థితం - సమీపంగా వచ్చియున్నట్టి రావణంచ - రావణుని గూడ అగ్రతః - ఎదురుగా దృష్ట్వా - చూచి సమరే - యుద్ధమందు చింతయా - చింతతో స్థితం - ఉన్నవాడును ౨. దైవతైశ్చ - దేవతలతో గూడ సమాగమ్యః - కలసికొని రణం - యుద్ధమును దృష్టం - చూచుటకు అభ్యాగతః - సమయానికి వచ్చినటువంటినీ భగవాన్ - త్రికాలజ్ఞుడైన అగస్త్యః - అగస్త్యుడను ఋషిః - మహర్షి ఉపాగమ్యః - దగ్గరకు వచ్చి రామం - రాముని గూర్చి అబ్రవీత్ - పలికెను ౩. వత్స - కుమారా మహాబాహో - దీర్ఘమైన భుజాలు గలవాడా యేన - ఏ స్త్రోత్రము చేత సర్వాన్ - సమస్తమైన అరీ౯ - శత్రువులను సమరే - యుద్ధమందు విజయిష్యసి - జయింపగలవో తం - అటువంటి సనాతనం - నిత్యమైనదియు గుహ్యం - రహస్యమైనదియు నగు శృణు - వినుము ౪. ఆదిత్య హృదయం - ఆదిత్య హృదయమను స్త్రోత్రము పుణ్యం - పుణ్యమును గలుగ జేయును సర్వశత్రు వినాశనం - సమస్త శత్రువులను నాశనం జేయునది జయావహం - జయకరమైనది అక్షయం - నాశరహితమై నదియు పరమం - ఉత్కృష్టమైన శివం - క

కృష్ణుడి శిరస్సును సత్యభామ తన్నిందా?

 తాపీ ధర్మారావు గారి 'సాహితీ మొర్మొరాలు' పుస్తకం నుంచి ఓ వ్యాసం. ముక్కు తిమ్మన్నార్యు ముద్దు పలుకనీ, ముక్కు తిమ్మన్న ముద్దు ముద్దుగా ఏడ్చాడనీ, సహృదయు లన్నారు. మెప్పుకోసము చెప్పిన ఈ మాటలు పాఠకలోకాన్ని తప్పుదారి పట్టించాయేమో అని సందేహం కలుగుతుంది ఎందుచేతనంటే ఈ ప్రశంసపల్ల పాఠకులదృష్టి మాటలమీదను, వాటి ముద్దుతనం మీదను లగ్నమయిపోతుంది. ముద్దు మాటలు చూసి మురిసిపోతారు. ఇంతకంటే ఆ కావ్యంలో చూడవలసిందే లేదని అనుకుంటారు. భావం కోసం బాధపడవలసిన అవసరమే కనపడదు. అందుచేతనే కాబోలు, పారి జాతాపహరణం అభిమాన ప్రబంధంగా పఠించిన వారి సంఖ్య చాల తక్కువ. తక్కిన ప్రబంధాలలోని ఘట్టాలకు ఘట్టాలే కంఠస్థంగా వున్నవారు చాల మంది కనబడతారు; గాని పారిజాతాపహరణంలో నుంచి పట్టుమని పది పద్యాలయినా నోటికి వచ్చినవారు కనబడరు. ఆ పద్యాలయినా పాదతాడన ఘట్టింలోనివి. "పాటలగంధి చిత్తముల పాటిలు కోపభరంబు తీర్ప" కృష్ణుడు మ్రొక్కిన పద్యము? ... లతాంతాయుధు కన్నతండ్రి శిరము సత్యభమ వామపాదంతో తొలగద్రోసిన పద్యము "ఈసున బూట్టి డెందమున హెచ్చిన కోప దవానలంబుచే గాసిలి" సత్య ఏడ్చిన పద్యము - ఇలాంటివి మాత్రము వినగలుగుతాము. ఆ చదివిన ధ