ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

అక్టోబర్, 2010లోని పోస్ట్‌లను చూపుతోంది

తెలుగు భాష తీపిదనం

సి.వేదవతి గారి పుస్తకం 'తెలుగు-వెలుగు' నుంచి. "మహిమున్ వాగను శాసనుండు సృజియంపం గుండలీంద్రుండు దన్ మహనీయస్థితి మూలమై నిలువ శ్రీనాథుండు ప్రోవన్ మహా మహులై సోముడు భాస్కరుండు వెలయింపన్ సొంపు పాటించు నీ బహుళాంధ్రోక్తిమయ ప్రపంచమున తత్ప్రాగల్భ్య మూహించెదన్."                                                                                                    - రామరాజ భూషణుడు. వేయి ఏళ్ళుగా తెలుగుజాతి వేయి విధాలుగా పండించుకొన్న సజీవ భాష తెలుగు భాష. ఆంధ్రభాష అమృతం వంటిదనీ, దేశ భాషలలో ఎన్నికను గడించిందనీ అనటానికి నిదర్శనం - శ్రీకాకుళ క్షేత్రంలో వెలసిన శ్రీ ఆంధ్ర మహావిష్ణువే స్వయంగా శ్రీకృష్ణదేవరాయల వారికి స్వప్నంలో సాక్షాత్కరించి అన్న మాటలు - " తెలుగదేల యన్న దేశంబు తెలుగేను దెలుగు వల్లభుండ దెలుగొకండ యెల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి దేశ భాషలందు దెలుగు లెస్స!" కన్నడ రాయడైన శ్రీకృష్ణదేవరాయలవారిని కావ్యం కన్నడంలో కాక తెలుగులో చెప్పమనడానికి కారణం - తాను తెలుగు వల్లభుడవటమే కాకుండా, దేశ భాష లన్నిటిలోనూ తెలుగుకు విశిష్టత గూడా వుంది కనుక - అంటాడు ఆ ప్రభువు. ఆంధ్ర