ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

జులై, 2009లోని పోస్ట్‌లను చూపుతోంది

ఏదీ నాది కాదు - రావూరి భరద్వాజ

"నీకు సంతృప్తి కావాలా? అసంతృప్తి కావాలా?" అన్నారు ప్రభువు ఉదయపు నడకలో. "అసంతృప్తి" అన్నాను. ప్రభువు ఆశ్చర్యంగా చూశాడు నావేపు. "ఉన్న చోటనే ఉండి పొమ్మంటుంది సంతృప్తి. మునుముదుకు నడిపిస్తుంది అసంతృప్తి" అన్నాను. ప్రభువు నా వీపు తట్టాడు! ఎందుకో తెలీదు. ****************************** "నన్ను మండించాలని నీవూ, నిన్ను మసి చేయాలని నేనూ, సహస్ర సహస్రాబ్దాలుగా తంటాలు పడుతున్నాం. నేను మండిపోనూ లేదు;నీవు మసి కుప్పగానూ మారిపోలేదు. హోరాహోరీ పోరాటం అనంత కాలాల దాకా, అవిచ్చిన్నంగా సాగుతూనే ఉంటుంది" అన్నది ఆ అంధకారం, దూరం నించి వస్తోన్న వెలుతురు వేపు చూస్తూ. ****************************** "వూవు నయిపోదామన్న ఉత్సాహంతో తీగ మీద వాలాను. నేనంటే గిట్టని చివురాకు నన్ను కిందకి తోసేసింది" అన్నదా వాన చినుకు. దెబ్బ తగిలిందా చిన్నా!" అంటూ ఆ చినుకును మెత్తగా హత్తుకున్నదో మట్టిబెడ్డ. ****************************** "తెల్లగా, చల్లగా, మెల్లగా పోతూపోతూన్నవారు కాస్తా;హఠాత్తుగా ఆగిపోయారెందుకు? కళ్ళు చికిలించి కిందికి చూస్తున్న