ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

స్కాంత రాతికోట కథ (చరిత్రలో చెఱిగిపోయిన యదార్థ గాధ)

భారతదేశము చిన్న చిన్న స్వతంత్ర రాజ్యములుగానుండి రాజుల ఏలుబడి యందుండెను. దక్షిణ భారతదేశ ప్రాంతమున "మంధోటి" యను పట్టణనము రాజధానిగా గల ఒక స్వతంత్ర రాజ్యమున కొన్ని అనివార్య కారణమువలన రాజులేని కారణమున అరాజకమేర్పడి సమర్ధులగు వారసులెవ్వరును లేని కారణమున పరిపాలనా దక్షుని ఎన్నికకై రాజ శాసనముననుసరించి రాజవంశ పూర్వాచార ప్రకారము, కఠినమగు యుక్తితో గూడిన నియమము నొకదానినినేర్పటు జేసి, ఆ పోటీలో గెల్చినవారికి రాజ్యాధికారము కలుగునని రాజ్యము నలుమూలల చాటింపు గావించి ఆ రాజ్యమునకు తగిన రాజుకొరకు రాజప్రతినిధులు వెదకుచుండిరి...

అది ఒక కుగ్రామము. గ్రామచావిడికి ప్రక్కగా శిల్పి బ్రహ్మయ్యాచార్యులవారి "అగ్నిశాల" కలదు. బ్రహ్మయ్యాచార్యులు పంచమవేదమైన ప్రణవవేద అధ్యయనమొనర్చిన ఓంకారోపాసకుడు. సకల ఆగమ శాస్త్రకోవిదుడు, పంచశిల్ప ప్రవీణుడు అయిన శిల్పాచార్య బ్రహ్మయ్యాఁచార్యులు తమ పెద్దలవద్ద నేర్చుకొన్న కులవృత్తిచే "అగ్నిశాల" యందు గ్రామవాసుల కవసరమైన పార, కర్రు, కాడి, మేడి, చెంబు, చెరవ, నగ నట్రలు మొదలగు సకల జనోపయోగ నిత్యావసర వస్తువుల తయారు చేసి గ్రామస్తులకు సకాలమున నందించి తన "జగద్గురు వంశ" జన్మమును సార్థకమొనర్చుకొనుచు, గ్రామప్రజలకు కన్నాకైయున్న బ్రహ్మయ్యాచార్యాలు అనుష్టానములాచరించి, శుచియై, నుదుటవిభూతిని ధరిచి, మెడలో రుద్రాక్ష మాలా విభూషితుడై కనకకుండల యజ్ఞోపవీతముల ధరించి, శిష్యగణములు వెంటరాగా, అగ్నిశాల ప్రవేశించి, ప్రదక్షిణ మొనర్చి, నమస్కరించి, ఉచితాసనమున ఉపవిష్టుడై యుండెను. గ్రామవాసులు కొందరటజేరి, లోకాభిరామాయణములతోడను, వేదాంతగోష్ఠులతోడను గ్రామప్రజలకు సకలశాస్త్రవేదాంత, ఇతిహాసములను ఓంకారోపాసన ప్రధానముగాగల పంచమవేదమైన "ప్రణవవేదము"లోని యంత్ర తంత్ర రహస్యములను, ప్రజలకు బోధిస్తూ, తన పనిని సాగిస్తూ కాలముగడుపుచుండగా నొకనాడు రాజశాసనమును చాటించు రాజసేవకులు డప్పు వాయించుచు వచ్చి చావిడిముందు బిగ్గరగా చాటింపు వేయించుచుండిరి.

అహో ప్రజలారా! ఇది వినుడు. మనరాజ సింహాసనము నధిష్టింపగోరు వారు రాజశాసనము ననుసరించి "సువిశాల ప్రదేశమున ఇసుకచే చదును చేయించిన స్థలమధ్యమున నొకపీఠము నుంచబడినది. ఆ ఇసుకలో పాదముల గుర్తులు పడకుండా ఆ పీఠమును చేరి ఎవరైతే ఆ పీఠముపై కూర్చొందురో వారే ఈ రాజ్యమునకు రాజుగాగలరు." దేశపౌరులెల్లరకు ప్రవేశార్హత గలదహో ... ఇది రాజశాసనము. అని చాటింపువేసిరి.

 ఆ చాటింపువిని ప్రజలు అదెట్లు సాధ్యమని పరిపరివిధముల మాట్లాడుకొనుచుండిరి. గ్రామ ప్రజలలెల్లరకు ఇదొక వింతైన సమస్యగా తయారై ఎవరినోటవిననను ఈ విషయమునే ఆలోచించుచు ఉపాయము తెలియక తికమక పడుచుండిరి.. అగ్నిశాల వద్ద పనిచేయుచున్న బ్రహ్మయ్యాచార్యులు చిరునవ్వునవ్వి ఇది ఒక షరతా! ఇది ఒక ఘనకార్యమా? నిలువెత్తుచాపనుపరచి దానిపై పరుండి చాపను చుట్టుకొనుచు వెళ్ళి పీఠముపై కూర్చొనవచ్చును గదా! అని సహజధోరణిలో మాట్లాడుచు తనపనిలో తాను నిమగ్నుడైయుండెను. ఆ మాటలు శ్రద్ధతో ఆలకించిన వడ్డెర చంద్రయ్య మరునాడే రాజధానికి బయలుదేరి వెళ్ళి గురువాక్యానుసారముగా ప్రవర్తించి, వారు విధించిన నియమమున గెలుపొంది, రాజశాసనము ప్రకారము రాజ్యమునకు రాజాయెను.

రాజైన చంద్రయ్య సపరివార సమేతుడై భక్తి శ్రద్ధలతో గురువు గారి వద్దకేగి వస్త్రభూషణముల నొసంగి సాష్టాంగ ప్రణామము లాచరించి సత్కరించి వినమ్రుడై ఇట్లనియె. స్వామీ మీ యొక్క కృపాకటాభముల వలననే నేను రాజునైతిని. రాళ్ళు కొట్టగలనేగాని రాజ్యములు నేనేమి ఏలగలను. ఇంత వరకు మీరే నా గురువులు ఇకపై కూడా మీరే నా గురువులు. అందువలన ఈ క్షణమునుండి నేనేమి చేయవలయునో మీరాజ్ఞాపింపుడు. నేను శిరసావహింతును అని వేడుకొన్న రాజుమాటను మన్నించి .. బ్రహ్మయ్యాచార్యులు రాజధానికి చేరి చంద్రయ్యను "చంద్రసేన మహారాజుగా"  రాజ్యాభిషక్తుని జేసి గురువు, మంత్రి, స్నేహితుడు, సర్వము తానే అయి శిష్యునకు రాజనీతిని బోధించుచు రాజ్యపాలనా సారధ్యమును వహించి ప్రజారంజకమగు ఎన్నో నూతన శాసనములను అమలులోనికి తెచ్చెను.

అనువంశకముగా రాజవంశహితుడును, కులపురోహితుడును, రాజగురువును అగు వ్యాసభట్టారకుడు బ్రహ్మయ్యాచార్యులపై అసూయచే రాజుకు దుర్బోధలు చేసి, రాజాజ్ఞగా బ్రహ్మయ్యాచార్యులని, అతని జాతిని నాశనం చేయమని భటులను పంపించెను...

తమజాతికి జరిగిన విపత్కర పరిస్థితికి కలత చెందిన బ్రహ్మయ్యాచార్యులు సాటి శిల్పాచార్యులతో చర్చించి సకల శిల్పశాస్త్రములయందంతటాగల మర్మములను శోధించి, విశ్వకర్మకులజులెల్లరు భద్రముగ శత్రువులెవ్వరి చేత ప్రమాదము లేకుండా నుండుటకై ఒక కోటను నిర్మింపవలెనని ఆలోచించి ఒక యంత్ర, తంత్ర, శాస్త్రపరిజ్ఞానముతో ప్రణవవేద సిద్ధాంత ప్రకారము మామూలు పర్వతశిలలకు కృత్రిమ పద్ధతిన అతి శక్తివంతమైన ఆకర్షణ శక్తిగల అయస్కాంతశక్తిని ప్రసరింపజేసి, మేధావులైన శిల్పాచార్యులు వారే స్వయముగా శత్రువులకు అభేద్యమైన ఒక స్కాంతరాతి కోటను నిర్మించిరి.

ఆ కోటలో ఎన్నో యంత్రము తంత్రములు నిర్మించి, శత్రువులే కాదుగదా, వారి అనుమతిలేనిదే గాలిగాని, చివరకు సూర్యకాంతిసైతము ప్రసరింప వీలులేకుండా నిర్మించుకొని, ఆ స్కాంతరాతికోటలో మరొక నూతన ప్రపంచమును తయారుచేసి జాత్యాధిపత్యమున వలన పడరాని చిత్రహింసలు పడిన విశ్వకర్మ కులజులకు ఒక ప్రశాంతజీవనము నేర్పరచెను.

కానీ శత్రువులు తమకన్నా బలవంతులైన కారణము చేత యేనాడైనను తిరిగి విపత్కర పరిస్థితి ఏర్పడునేమోనన్న ఆలోచనతే అట్టిపరిస్థితి నెదుర్కొనుటకు నవనాగరికతా శాస్త్రానుసారముగా పక్షిరూపములతో గాలిలోనికి ఎగిరి స్వేచ్ఛగా విహరింపగల యంత్రములతే కూడిన "కీలుగుర్రములను","విమానములను" నిర్మించిరి. అధునాతనమైన మయవాస్తు ప్రకారము భవాలను, ఆయుధములను, విశేషశక్తిగల కత్తులను, బాణములను, ఎంత దూరమునకైనను గురితప్పక పనిచేయు విధానములతో తయారుచేసి శతృవులు ఏ క్షణా దండెత్తినను ఎదుర్కొనే విధంగా వారి యొక్క పాంచాయుకులకు అన్ని విద్యలలో ప్రావీణ్యతను అలవరచి శతృవులకు వీరి రహస్యములను ఎవరు కూడా ఎట్టిపరిస్థిలో కూడా తెలియకుండా, గుర్తింపుపొందిన కొందరు తప్ప మరెవ్వరునూ కోటదాటి వెలుపలకు పోరాది కఠి నియమములు విధించిరి. యువకులెల్లరు యుద్ధశిక్షణపొంది అప్రమత్తులై తమ కుటుంబములను రక్షించుకొనుచుండిరి.

తమ ఎత్తులు ఫలించి బ్రహ్మయ్యాచార్యులను ద్రోహిగా చేసినందులకు రాజగురువు వ్యాసభట్టారకుడును సేనానియు సంతోషించినవారై రాజునకాప్తులై వారి పూర్వపు ఉన్నతపదవులు చేజిక్కించుకొని రాజశాసనములను వారికనుకూలముగా మార్పులు చేయించిరి. హీనకులజుడగు రాజునకు తలవంచుట వారికి మనస్కరింపక అతని పతనమునకై పధకములు పన్నుచుండిరి. ప్రజలకు ప్రభువుపై విముఖత్ము కలిగి తమ గౌరవము పెరగుటకై కొన్ని అస్తవ్యస్తములగు శాసనముల నమలుగావిచంరి...

పలాయనులైన పాంచాలకులస్తులు నూతనముగా స్కాంతరాతి కోటను నిర్మించుకొనినారని తెసుసుకొన్న వ్యాసభట్టారకుడు సైన్యములను సమీకరించి అయస్కాంత దుర్గమును ముట్టడింప నాజ్ఞాపించెను. యుద్ధమునకు వెళ్ళిన సైనికులు స్కాంతరాతికోట ప్రాంతమును చేరగనే వారు ధరించిన ఆయుధములు, కవచములు, గుర్రముల కళ్ళెములు ఇతర పరికరములన్నియు ఇనుముచే నిర్మింపబడి యుండుటచే కోటకు ఎంతో దూరమున నున్నుప్పుడే అయస్కాంత శక్తిచే ఆకర్షింపబడి మిడతదండువలె కోటగోడలను ఢీ కొట్టుకొని కోట గోడలకు వారు నిర్మించి యుంచిన కత్తులవంటి ఆయుధముల వలన చిదురు చిదురై ప్రాణములు పోగొట్టుకొనుచుండిరి.

యుద్ధమునకు వెళ్ళిన సైనికులు ఎంతగా ప్రయత్నించినను కోటను సమీపించలేకపోయిరి గదా.. కనీసము వార్తనందించుటకైను తిరిగి రాలేకపోయిరి.

పరాజితుడైన వ్యాసభట్టారకుడు స్కాంతరాతికోటను భేదించు ఉపాయమెరుంగక పరిపరివిధముల నాలోచించుచుండెను.

కాలము గడచుకొలది సమస్యలు సమసిపోవుచున్నుట్లగపడుచుండెను. స్కాంతరాతికోటనుండి ధైర్యవంతులు, వీరులు అగు యువకులు రహస్యముగా నగరములో ప్రవేశించి సంబారములను సేకరించుకొని నగరములలోగల వినోదముల తిలకించి వెళ్ళుచుండిరి. వేగులమూలమున ఈ విషయము గ్రహించిన వ్యాసభట్టారకుడు శతృవులను శక్తితో ఎదుర్కొనజాలమని నిర్ణయుంచుకొన్నవాడై కపటోపాయమునగాని సాధ్యపడదని గ్రహించనవాడై నగరమందంతటా స్కాంతరాతికోటను భేదించు ఉపాయమైనను అందునివశించు వారినెవరైనను పట్టి ఇచ్చినను, విశేష బహుమానములీయబడునని ప్రకటించెను.

ఆ ప్రకటనను విన్న సామాన్య ప్రజలు వారిని పట్టి ఇచ్చుటకు ముందునకు రాకపోవుటయే కాక వారితో సహకరించి అభిమానముతో సహాయమొనర్చుచు, రాచగరులో జరుగు కుట్రలను ఎపపటికప్పుడు అయస్కాంత దుర్గాధినేతలకు తెలియజేయుచుండిరి.

అట్టి సమయమున నెరజాణయని ప్రసిద్ధివహించిన అతి తెలివైన మంజరియను వేశ్య యొకతె వ్యాసభట్టారకుని వద్దకరిగి...

స్వామీ స్కాంతరాతికోటను నాశనమొనరించు ఉపాయము యేవిముననైనను మీకు తెలియపరచెదనని చెప్పి కొంత ధనమును తీసుకొని కోటపరిసర ప్రాంతములలో తన నివాసమేర్పరచుకొని స్కాంత రాతి దుర్గము నుండి రహస్యముగావచ్చు కొందరు యుకులను తన శరీరసౌందర్యమును ప్రదర్శించి వగరొలికించుచు తనవైపునకాకర్షితులగునట్లు విస్యాసములొనర్చుచుండు సమయమున...
నీతి తప్పరాదు - పరకాంతావ్యామోహము పనికిరాదు అని పెద్దలెంతగా బోధించుచున్నను రహస్యముగా నగరమునకు వచ్చుచు పోవుచున్నన యువకులలో కొందరు, కోటసమీపమునగల నెరజాణయైన వేశ్యచేయు విన్యాసములకు రంజింపడిను కట్టుబాట్లకు భయపడి తప్పించుకొని వెళ్లుచుండిరి. అందొక్కడు సువర్ణవృత్తి వంశమునకు చెందిన విశ్వకేతుడు అనువాడు. విధివశాత్తు ఆ వేశ్యావ్యామోహమునకు గరియై ఆమె పన్నిన ఉరుల నుండి తప్పించుకొనలేక కామోన్మాదపరవశుడై ఆ వేశ్యా గృహమున జేరి దానితో భోగించుచు మత్తెక్కి ఆదమరచియున్న సమయమున యేదోవిధంగా కోటరహస్యము కనిపెట్టవలెనను కపటబుద్ధిగల మంజరి - ప్రియా విశ్వకేతా స్కాంతరాతికోట తగులబడు శత్రువులు కోటను ముట్టడించుచుండగా నీవిచ్చట నుంటివేమి? అని ఆశ్చర్యముగా అన్న మాటలు విన్న విశ్వకేతుడు - అదెట్లు సాధ్యము, విశ్వకర్మలు అజాగ్రత్తగా నిదురించు సమయమున తప్ప ఎవవ్వరు ప్రవంశింపలోరు, అందునను కోటచుట్టును అరిక గడ్డి వేసి కాల్చినగాని అయస్కాంతశక్తి నశింపదుగా అని మైనకునపలికి వెంటనే తత్తరపాటున మేల్కొనిన విశ్వకేతుడు

నీ సాన్నిధ్యము నన్ను జేర్చుకొని దుర్నీతుల్ ప్రబోధింపుచున్...

ఈ రహస్యమెవరితో చెప్పవద్దు అని మంజరిద్ద మాట తీసుకొన్న వాడై వెంటనే బ్రహ్మయ్యాచార్యులవారి వద్దకుపోయి నేను తప్పుచేసితిని, మన జాతి వినాశనమునకు నేనే కారకుడనైతిని. ఆ వేశ్య మంజరి మాయలోపడి కుట్రతో కూడిన ఆమె పన్నిన వలలో జిక్కి కోటను బేధించు రహస్యమును జెప్పితినని ఆ క్షణముననే వారికి చెప్పెను, వెంటనే పెద్దలందరు సమావేశమై స్కాంత రాతికోట ఆజ్ఞను ఉల్లఘించి జాతికి ద్రోహముచేసిన ఈ నీచునికి మరణదండనవిధింపుడని నిర్ణయింపగా, పశ్చాత్తాపమునకు మించినశిక్ష లేదని బ్రహ్మయ్యాచార్యులు వదలెను.

రహస్యమునెరింగిన మంజరి వెంటనే వ్యాసభట్టారకుని చేరి స్కాంత రాతికోటను బేధించు విషయమంతా వివరించెను.
ఆతఁడు సైన్యమును సమీకరించి, అర్ధరాత్రమున సేనలనంపి కోటను ముట్టడించి ఆదమరచి యున్న సమయమున కోట చుట్టు అరిక గడ్డి వేసి భయంకర జ్వాలలెగయునట్లుగా తగులబెట్టగనే ఆ కోటకు గల అయస్కాంత శక్తి తగ్గగనే కోటలో ప్రవేశించి మైమరచి నిదురించుచున్న వారిపై శత్రు సైన్యములు ఉప్పెన వలె విరుచుకుపడిరి. ఆ సమయమున విశ్వకర్మీయులు యేమరుపాటగానుండటయు, యుద్ధసన్నద్ధులై యుండకపోవుట చేతు శతృవులు విజృభించి స్త్రీలను, పాపలను, వృద్ధులను ఊచకోత కోయుచుండుట చూచిన యువకులు వీరోచితముగా పోరాడినను అధికసంఖ్యాకులైన రాజనైనికులముందు వీరేమియు చేయజాకలక అశక్తులైరి.

ఇది గమనించిన కొందరు శిల్పులు, బ్రహ్మయ్యాచార్యుల వంటి మేధవులు మాత్రము వారివద్దగల వాస్తుశాస్త్రములను, యంత్ర మంత్ర శాస్త్రములను, సాంకేతిక శాస్త్ర సంబంధమైన విషయములు గల్గిన ప్రణవవేదమును, విశ్వకర్మకులజులకు అతి పవిత్రమగు వారియొక్క జాతి సంబంధములైన నాగరఖండము మూలస్తంభము మొదలగు ఎన్నో అపూర్వగ్రంధములను తమ వెంట తీసుకొని అధర్వణవేదమునగల మారణమంత్రములతో అయస్కాంతదుర్గమును నశించునట్టు మారణహోమమొనర్చి, యంత్ర నిర్మిత కీలుగుర్రములు, వమానములపై వారి కుటుంబములతో ఆకాశమార్గమున ఎగిరిపోయిరి.


ఈ కథ క్రీస్తుకు పూర్వము ౬౦౦ ప్రాంతమున జరిగినట్లు కొన్ని ఆధారములబట్టి తెలియుచున్నది. ఈ అయస్కాంత దుర్గ పతన చరిత్రము ఉజ్జయినీ ప్రభువగు భర్తృహరి ద్వారా జరిగినట్లు ఒక కథయు, పరిమశచోళుి వారసుడు కళింగుని ద్వారా జరిగిట్టు ఒక కథయు, ఇంకను కొన్ని కొన్ని బేధములతో జనశృతులుగా ఈ స్కాంతరాతికోటపతన కథ కలదు.

ఒకనాడు భారతదేశముతోనైక్యమైయున్న సింహళమున - కొలంబోనుండి జాఫ్నా కు పోవు మార్గమున "స్వా" కు ౧౩ కిలోమీటర్ల దూరముననున్న శిధిల గ్రామమునే "మంధోటి" నగరమని అదియే ఈ కథాస్థలమనియు, అచ్చట నేటికి విశ్వకర్మీయుల నివాసచిహ్నములు ఉన్నట్లుగా "సిలన్ గెజిటియర్" అను గ్రంధమున ౧౫వ పుటలో లిఖింపబడియున్నది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గిజిగాడు

జిలుగుం బంగరు రంగులం గులుకు మేల్చిన్నారి పూగుత్తి సొ మ్ములు గీలించిని తుమ్మగొమ్మలకు, నీవు న్నీ సతీరత్న మూ యెల గీమున్ దగిలించి రేఁబవలు హాయిందూఁగరా గాడ్పు బి డ్డలు మీ కూడిగ మాచరింప, గిజిగాఁడా నీకు దీర్ఘాయువౌ! తేలిక గడ్డి పోచఁలను దెచ్చి, రచించెద వీవు తూఁగటు య్యేల గృహంబు, మాలవుల కేరికి సాధ్యముగాదు, దానిలో జాలరు, లందులో జిలుఁగు శయ్యలు నంతిపురంబు లొప్పగా మేలు భళీ! పులుంగుటెకిమీడవురా గిజిగాఁడ? నీడజా! కులుకు పసిండినిగ్గుల దుకూలములన్ ధరియించి ముద్దు బి డ్డలును, బడంతి నీ పొదిగిట న్ని దురింపఁగఁ గన్నెగాడ్పు లూ యెల సదనంబుఁలూచ, భయమింత యెరుంగక కన్నుమూయు నీ యలఘు సుఖంబు మాకుఁ గలదా! గిజిగా? యొక ఱేని కున్నదా? అందమున నీకు నీడగు నందగాడు గృహవినిర్మాణమున నిన్ను గెలుచువాడు వైభవంబునఁ బోలు దేవతల ఱేఁడు లేఁడురా గి జిగా! మొనగాఁడ వోయి నీ గిజిగాని నామకము, నీ తెలివిం బ్రకటించు గూడు, నీ మైఁగల సోయగం బవని మానవకోటికి ముద్దుసేయు నో యీ! గిజిగాడ! భీతిలకు! నీవు ధరాతలి నున్న బిట్టుగా వాగెడు నాస్తికు ల్తలు వంతు రనంతుని చెంత ఖిన్నులై.

తెలుగు భాష తీపిదనం

సి.వేదవతి గారి పుస్తకం 'తెలుగు-వెలుగు' నుంచి. "మహిమున్ వాగను శాసనుండు సృజియంపం గుండలీంద్రుండు దన్ మహనీయస్థితి మూలమై నిలువ శ్రీనాథుండు ప్రోవన్ మహా మహులై సోముడు భాస్కరుండు వెలయింపన్ సొంపు పాటించు నీ బహుళాంధ్రోక్తిమయ ప్రపంచమున తత్ప్రాగల్భ్య మూహించెదన్."                                                                                                    - రామరాజ భూషణుడు. వేయి ఏళ్ళుగా తెలుగుజాతి వేయి విధాలుగా పండించుకొన్న సజీవ భాష తెలుగు భాష. ఆంధ్రభాష అమృతం వంటిదనీ, దేశ భాషలలో ఎన్నికను గడించిందనీ అనటానికి...

పాత పుస్తకాలు - డౌన్లోడ్ చేసుకోవటం - Digital Library of India

మొదట  Downloader-NEW ( Downloader-OLD )ని డౌన్లోడ్ చేసుకోండి. ఇంతకు ముందే Downloader-OLD డౌన్లోడ్ చేసుకున్నట్లయితే  update(NEW) కోసం Update(12-09-10) click చెయ్యండి.  Unzip చెయ్యండి. runDM.bat file ని run చెయ్యండి. 'chandamama' option select చేయండి. 'Download Location' field లో మీరు ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ ఇవ్వండి like C:\ లేదా 'Browse' Button click చేసి  location select చేసుకోండి. 'Year','Month' select చేసుకొని 'download' button click చెయ్యండి. ఒక్కో పేజి download అయిన తర్వాత ఇది ఒకే pdf file గా కలుపుతుంది(with year-month name). -------------------------------------------  1st Picture లో 'Digital Library ' select చేసుకుంటే Digital Library of India నుంచి పుస్తకాలు డౌన్లోడ్ చేసుకోవచ్చు. 'http://www.new.dli.ernet.in/'   లో పుస్తకం వెతికి URL తెచ్చుకొని, దాన్ని 'URL' field లో paste చేసి 'add to download ' button click చెయ్యండి. తర్వాత 'd...