అమరావతి పేరు విన్నంతనే ప్రతి ఆంధ్రుని హృదయముకూడ ఉప్పొంగి పోవును; ప్రతి భక్తుని చిత్తము గూడ భక్తితో తన్మయమగును. ప్రాచీనకాలపు విజ్ఞాన వైభవమునకు, శిల్పకళా ప్రాభవమునకు, అఖండ బౌద్ధ సంస్కృతికి గురుపీఠమై దేశదేశాంతరములలో నాగరికతా దీప్తులను ప్రసరింపజేసిన అమరావతి ఆంధ్రులకే కాదు, భారతీయులందరికిని ఆరాధింప దగిన పవిత్రస్థానము; స్మరింపదగిన చారిత్రక ప్రదేశము.
శాతవాహన రాజులు మగధ నుండి కన్యాకుమారిదాక దక్షిణాపథమును పాలించెడి రోజులలో కృష్ణానది యొడ్డున నున్న ధాన్యకటకము దక్షిణదేశపు నగరములకన్నింటికిని తలపూవై ప్రకాశించినది...
పూర్తి పుస్తకం కోసంఅమరావతి క్లిక్ చేయండి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి