శ్రీ రామరక్ష : జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం గుర్రము తిన్న గుగ్గిళ్ళు జీర్ణమై ఏనుగు తిన్న వెలక్కాయ జీర్ణమై భీముడు తిన్న పండివంటలు జీర్ణమై అర్జునుడు తిన్న అప్పాలు జీర్ణమై అబ్బాయి తిన్న పాలు ఉగ్గు జీర్ణమై కుంది లాగా కూర్చొని నంది లాగా లేచి తాంబేలు లాగా తాళి చల్లగా ఉండాలి శ్రీరామ రక్ష నూరేళ్ళాయుస్సు తి.తి.దే వారి హిందూ ధర్మ పరిచయం పుస్తకం నుంచి - శ్రీ ముదివర్తి కొండమాచార్యులు గారు బిడ్డకు వుగ్గుపెట్టి పొట్ట నిమురుతూ మెల్లిగా కాలుచేతులు ముడిచి సాగదీస్తూ తల్లులు ఈ పాట పాడుతారు. తనబిడ్డ అగస్త్యుడిమాదిరి తిన్నది అరిగించుకుని దినదినాభివృద్ధి పొందుతూ ఆరోగ్యవంతుడై, ఆయుష్మంతుడై సుఖంగా వుండాలని తల్లి కోరుకుంటుంది. ప్రాతః స్మరణీయుడైన ఈ అగస్త్యుడు దైవాంశసంభూతుడు. మహా తపస్వి. ఉదారచరితుడు. కరుణాస్వభావుడు. వీర్యవిక్రమసంపన్నుడు. ఆయన త్యాగమయ జీవితం చతుర్యుగాలకు విస్తరించి వుంది. జననం: అగస్త్యుడు మనమాదిరి మాతృగర్భం నుంచి ఉదయించలేదు. కలశం నుంచి ఉద్భవించాడు. ఆయన పుట్టుక బహు విచిత్రమైనది. ఇక్ష్వాకు పుత్రుడైన నిమి అనే రాజు...
క్షోణితలంబు నెన్నుదురు సోకగ వందనంబు తెలుగు తల్లికి.