ఉత్తర భారతావనిలో కళలకు కాణాచియై కళ్యాణపురంబు కలదు. అందు శిల్పకళాకోవిదుడైన విశ్వకర్మ వంశీయుడగు ధర్మపాలుడు అను శిల్పాచార్యుడు కలడు. అతడు విద్యలలో బృహస్పతితో సమానుడు. సకల శాస్త్ర మంత్రసిద్ధుడు. అతని శిల్పచాతుర్యమునకు ప్రభువులు మెచ్చి అర్థాసనమిచ్చి గౌరవించిరి. అతనినాశ్రయించి ఎందరో శిల్పకళాకోవిదులు జీవించుచున్నారు. అతని శిల్పశాలయందు అగ్ని, జల, వాయు యంత్రములు అమర్చబడియున్నవి. ఆ కళాక్షేత్రమున కులదైవములగు శ్రీ విశ్వకర్మ భగవానుడు, శ్రీ కామాక్షిదేవి ఆలయములు నిర్మించి ప్రతిష్టించి నిత్యము శిల్పాచార్యులు ఆరాధించుచుందురు.
ఆ ధర్మపాలునకు రుద్రసేన, భద్రసేన, ఇంద్రసేనులను కుమారులు గలరు. వారు తండ్రితో సమాన ప్రతిభావంతులు. నియమ నిష్టాగరిష్టులు, మంత్రవేత్తలు. గదా, ఖడ్గ, బాణ యుద్ధములలో నిపుణులు. ఆ శిల్పాచార్యులు భస్మ, రుద్రాక్షమాలా విభూషితులై సదా వేదాధ్యయనమొనర్చును. శరణాగతత్రాణ బిరుదాంకితులై వెలయుచుండిరి.
ఆ శిల్పాచార్యులు తమ శిల్పకళానైపుణ్య ముట్టిపడునట్లు సువర్ణ, రజిత, తామ్ర, కాంశ్యాది లోహంబులతో
విగ్రహములు చేయుచుండిరి. వెండి పన్నెండువంతులు, రాగి పదునారు వంతులు, బంగారు పదివంతులు కలిపి మిశ్రమలోహము న దైవ విగ్రహములు రూపొందించి మృత్యువు, దరిద్రము నశించును. శాస్త్రవిధిననుసరించి పంచలోహమును తయారుచేసి మయ సిద్ధాంతాను సారముగా చేయుచుండిరి.
ఉత్తమ నవతాళము ననుసరించి శిరస్సుపొడవు నాలుగంగుళములు, ముఖము పొడవు పన్నెండంగుళములు, కంఠము నాలుగంగుళములు, స్తనమధ్యము వరకు పండ్రెండంగుళములు, స్తన మధ్యము నుండి నాభివరకు పండ్రెండంగుళములు...
ఈ విధముగా నవతాళ ప్రమాణమున దైవ విగ్రహములను సర్వాంగసుందరముగ రూపొందించి, ఇంకను ప్రజోపయోగకరములగు నిత్యావసర వస్తువులను, విలాసవంతులు భోగములకుపయోగించు అలంకార సామగ్రులను, ఎన్నెన్నో చిత్రవిచిత్ర వస్తువులను ఆకర్షణీయముగా నిష్ణాతులగు శిల్పాచార్యులచే తయారు చేయించి బండ్లపై సిద్ధము చేయించి, దేశము నలుమూలల విక్రయించుచు విశేషఖ్యాతిని గడించుచు, అపరిమితి ధనంబార్జించుచు, తిరిగితిరిగి కొంత కాలంబునకు కాంచీపురంబు ప్రవేశించిరి.
ప్రసిద్ధ శిల్పకళా పోషక నగరమని ప్రశస్తిగాంచిన ఆ కాంచీ పట్టణమున తమకు పూర్వమిత్రుడు కామకోటి పీఠాధిపతియగు శ్రీ శంకరాచార్యులను కలుసుకొని అతని ఆతిధ్యమును, సత్కార్యములను పొందినవారై, శ్రీ ఏకామ్రేశ్వరుని దర్శించి, కామాక్షీదేవిని సేవించి, వరదరాజ స్వామిని పూజించి, ఆలయ శిల్పసౌందర్యము వీక్షించి తమ జన్మ సఫలత నొందెనని సంతుష్టాంతరంగులైన ఆ శిల్పబ్రహ్మలు తమ వ్యాపారమునకనువగు స్థలమును శ్రీ కామాక్షీదేవి ఆలయ ముఖద్వారమున నున్న సువిశాల భూభాగముగా నిర్ణయించుకొన్నవారై అందు గుడారములనిర్మించి, తమ వద్దనున్న వస్తువునందు ఆకర్షణీయముగా వరుసలు దీర్చి, పేర్చి అలంకరించిరి.
ఇంకను అనేకములగు వస్తువులను మెరుగులు దిద్ది అందముగా అలంకరించి అమ్ముచుండగా పురజనులు వానిని కొనుటకై కొల్లలుగా వచ్చుచుండెను. ఏ వస్తువైనను ఎత్తునకు రెండెత్తుల బంగారము నకు తూనికతో యేవిధమగు మారుబేరములు లేక విక్రయించుచుండిరి. నానాటికి నగర పరిసర ప్రాంతముల నుండి ప్రజలు వివిధ వాహనములపైనను, కాలినడకను, నగరమునకు వచ్చుచుండిరి.
ఆనాడు మహాశివరాత్రి పర్వదినము. కామాక్షీదేవి దర్శనముకై కాంచీపురాధీశుని గారాలతనయ తన చెలికత్తెలతో కూడి ఆలయమునకేతెంచి దేవిని దర్శించి, ఆలయప్రాంత విశేషముల తిలకించుచు కాంశ్యపాత్రలలో అత్యన్త ఆధునికమగు పద్ధతులతో యిరువైపుల రెండుమయూరములు పురివిప్పియున్నట్లుగా చిత్రించి వానిమధ్యనొక అద్దమునమర్చి, దానికి పొందికగా మూతనమర్చి, దానియందే అలంకరణ సామగ్రియిముడు నట్లును, చేతికనువుగనుండి మనోజ్ఞమగు శిల్ప చాతుర్యముగల ఆ దర్పణమును చూచి దానిపై మనసుపడెను.
రాజకుటుంబ రక్షకుడుగా సపరివార సమేతుడై తోడువచ్చిన సూరన మంత్రి రాజకుమారి మనసెరిగినవాడై, ధర్మపానునిచేరి ఆచార్యా! మా రాకుమారి మీ శిల్ప నైపుణ్య ప్రతిభతో సృష్టించబడిన ఆ శృంగార దర్పణముపై మనసు పడినది కనుక దానిని మా రాజకుమారికి కానుకగా సమర్పింపుడనెను. అందుకు ధర్మపాలుడు మంత్రిశేఖరా! మేము దేశమునందెల్లెడ కాంశ్యవస్తు విక్రయమొనర్చుచుంటిమి. మా శిల్ప విజ్ఞతకు, హస్తకళా కౌశలమునకును మెచ్చి, ముగ్ధులై భూవలయమునగల భూపతులు సంపన్నులు, మమ్ములను సన్మానించి సమాదరించుచున్నారే గాని, కానుకగా ఇమ్మనిన వారులేరు. అదియునుగాక శ్రీమంతులైన మీవంటివారికి కానుకగా నొసంగుట మా శిల్పశాలా నియమములకు విరుద్ధము. కనుకు మూల్యమును చెల్లించి ముకురమును సరియగు వెలకు కొనుడు. అని పల్కిన మంత్రి వర్యుండిట్లనియె. కళానిధి అభీష్టము ప్రకారము మా ప్రభువులకు విన్నివించి మూల్యము నిప్పింపగలము. ప్రభువుతో మీకు పరిచయమును కల్పింతుము. మీరు సభకురండు అని పల్క ధర్మపాలుండు తనకుమారుడగు రుద్రసేనుని రాజసభకంపెను.
కుత్థ్సిత బుద్ధియగు ఆమంత్రి రాజువద్ద కరిగినవాడై ప్రభూ! మన కాంచీపురమునకు కాంశ్యకారులగు వ్యాపారుల బృందమొకటి వచ్చి వస్తువులను విక్రయించుచున్నారు. నేడు రాజకుమారి ఆలయమునకేగి వచ్చుచు మార్గమధ్యమున నున్న ఆ యంగడిలోని ఒక అద్దముపై ముచ్చట పడినది. వెలయివ్వనిదే ముకురమును ముట్టరాదని వారలనిరి. అద్దములేకున్న అంతఃపురి రానని రాకుమారిగారు హటము వేసిరి. ఇట్టి స్థితిలో మూల్యమును చెల్లింతుమని పల్కి ఆ విశ్వకర్మకులుని వెంటనిడుకొని వచ్చితిని. అద్దము అమ్మాయిగారి సదనమున జేర్చి ఈ విషయమును మీ కెరింగింప వచ్చితిని. వీడు ధనమునకై వచ్చి దయ్యమువలె నా వెంటబడి తిరుగుచు వేధించుచున్నాడు.
వీడు అమ్మెడు కంచుపాత్రలకు ఎత్తుకు రెండెత్తుల బంగారము చొప్పున వెలయట! మన నగరమునగల బంగారము నంతయు దోచుకొనుచున్నారు. ప్రభూ! వారడిగిన వెలయిచ్చి పంపమందురా! తమ ఆజ్ఞ - సెలవిండు అని మంత్రి పలుక, చోళభూపతి కోపమున మంత్రినుద్దేశించి, ఇట్లనియె - ఏమీ కమ్మరవాని కింత కండపొగరు? ఏదీ వానినిటు రమ్మనుడని అతని సభకు రప్పించి, ఏమిరా కాంశ్యాకారాధమా ముచ్చటపడి మా కుమారి కోరినదే తడవుగా మహా ప్రాసాదమని సమర్పించు కొనుటకు మారు మూల్యము నిమ్మనుచున్నారా? అటయిన ఇదివనుము. వ్యాపారార్థము మా నగరమున సరుకుల నమ్ముకొన్నందుకు సుంకమును చెల్లింపుడు. సుంకములేని వ్యాపారమెందైనను గలదా? కనుక సుంకము చెల్లించి రాజానుమతిని పొంది మీ వ్యాపారము సాగింపుడని పలుకగా, రుద్రసేనుడిట్లనియె.
అయ్యారే! ఇదెక్కడి న్యాయము మహారాజా, ఆసేతు శీతాచల పర్యంతము మమ్మిప్పటి వరకు సుంకమడిగిన రాజులు కానరారు. మా కళా నైపుణ్యమునకు మెచ్చి మమ్ము గౌరవించి సన్మానించి, మా వ్యాపారమును ప్రోత్సహించిరేకాని, మమ్ము సొమ్ములడిగినవారు లేరు. జగతికి కళలే మూలాధారములు. ఆ కళలను, కళాకారులను, అగౌరవించిన రాజులుగాని, రాజ్యముగాని, అర్థవిహీనులై, దరిద్రముల కాటపట్టులగును.
వెల ఇచ్చెదమని నమ్మించి మోసగించుట తగదు. యీ దుష్కృత్యముతో మీరు అపకీర్తి పొందుదురు. అని పలుకగా, రాజు ఉగ్రుడై సైన్యాధ్యక్షునితో నిట్లనియె.
దండనాయకా, వీడెంత పొగరుబోతు. శిల్పులు మన ఊరలేరా? ఇట్లెవరైన మర్యాదదప్పి మసలినారా ? ఈ రాజధిక్కారమునకు వీనిని కొట్టుడు, తిట్టుడు, తన్నుడు, తలదీయుడని ఆజ్ఞాపించెను.
రాజాజ్ఞను శిరసావహించి తన పై బడి వచ్చు సాయుధులగు సైనికులపై కోపించిన రుద్రసేనుడు తనచేతనున్న 'తూచుకోలను' మంత్రించి ప్రయోగించెను. యంత్ర సహితమును, మంత్రపూరితమును అగు ఆ 'తూచుకోల' ఇంతింతై, అంతై మహామారణాయుధమై విజృంభించి ఆ సైనికుల నందరను దునుమాడెను. తూచుకోల సాయమున తానొక్కడే సేనాసమూహముల నిర్జించి సురక్షితముగా తండ్రిని జేరి సంగతిని సవిస్తరముగా నెరింగించెను.
మంత్రశాస్త్రసిద్ధుడు, దివ్యాస్త్ర ప్రయోగ ప్రవీణుడు అయిన రుద్రుసేనునిచే తుత్తునియలై పడిన తన సైనికుల పాటునకు రజ్జితుడైన రాజుతో దుష్టబుద్ధియగు సూరనామాత్యుడు, రాజా! విదేశ వ్యాపారులగు కాంశ్యకారులచే భంగపడుట మన రాజరికమునకే అవమానకరము. కనుక యుద్ధమొనర్చియైనను ఆ కంచరుల సంఘమును సమూలముగా నాశనమొనర్చకున్న అపకీర్తి పాలగుదుము అని పొగవేయజొచ్చెను. హితైషులగు ఇతర మంత్రులు మహారాజా వ్రేలు నలిగిన రోలంతైనది, రోలు నలిగిన ఇంకెంతగునో కదా, వృధావైరమున మన సైనికుల ప్రాణములు, మనకు ధనమును నశించును గదా యని బోధించిరి. కానీ దుష్ట చిత్తులగు మంత్రులు, మహారాజా, ఇప్పుడు మనము వెనుకంజవేసిన అసమర్థుల మనుకొనరా? ఇంతయై ఇప్పుడు అద్దమునకు మూల్యమిచ్చిన అవమానము కాదాద, ఈ సంగతి తెలిసి శతృవులు విజృంభింపరా?పరరాజులు పకపక నవ్వరా? అని సంగరోత్సాహమును కల్పించి యుద్ధసన్నద్ధలైరి.
సమరోత్సాహులై తమపై విజృంభించి వచ్చువారికి ధర్మపాలుడు వినయముగా సందేశమంపెను. మహారాజా! గోటబోవు దానిని గొడ్డట నరుకబోవుచున్నారా? యుద్దము సర్వానర్థములకు మూలము. అద్దము మూల్యమునకన్న సైన్యముల మూల్యము తక్కునని అనుకొంటిరా? దుష్టుల దుస్తంత్రములను విని కీడును కొని తెచ్చుకొనకుడు నిదురించు సింహముల తట్టిలేపుట తగదు. గుట్టుగా జీవించు ప్రజల కష్టముల పాలొనర్పకుడు అని సందేశమంప పెడచెవినిడి సంగరమునకే సమాయత్తపడుచున్న రాజానుమతం బెరిగిన ధర్మపాలుడు కుమారుల చేరబిలచి, నాయనలారా! రాజునకు కాలము చేరువైనది. మీరు యుద్ధమునకు సిద్దముకండు అని పలుకు వారు సర్వాస్త్ర శస్త్రముల ధరించి, ఆదిదేవుడగు శ్రీ విశ్వకర్మ భగవానునికి కృతాంజలులై ధ్యానించిరి.
పంచబ్రహ్మాత్మకుడైన ఆ విశ్వకర్మభగవానుని, సర్వాస్త్ర పటిష్టతమొనర్చి, ఆవాహనమొనర్చి, ధ్యానించి, కులదైవమగు కామాక్షీదేవిని జయకాంక్షులై పూజించిరి. కొదమసింగములై కదనభూమినిజొచ్చి విజృంభించి సర్వసైనికులను చిన్నాభిన్నమొనర్చి యుద్ధభూమిని పీనుగుపెంటలొనర్చిరి. రుద్రసేనుడు తులాదండమును మంత్రించి ప్రయోగింప సంగరభూమి సర్వమును నాశనమొనర్చిరి. చావగా మిగిలినవారు పలాయన మంత్రము పఠించిరి. విజయులై వచ్చిన విశ్వకర్మీయులు కామాక్షి దేవిని పూజించిరి.
సర్వముశూన్యమై దిక్కుతోచని స్థితినోనున్న మహారాజును సమీపించిన దుష్టబుద్ధఇయగు సూరనమంత్రి, మహారాజా అధైర్యపడకుడు. ఆ రుద్రసేనాదులు మంత్రవేత్తలు యుక్తిపరులు. వారిని భుజబలమున జయించుట అసాధ్యము. కనుక ధీశక్తిగల మన శంకరాచార్య గురుదేవుడు మనవిజయమునకు మార్గము నెరింగింపగలడు. మనరాజకుటుంబ శ్రేయోభిలాషియగు ఆ గురుదేవుడు ఆ విశ్వకర్మజుల కత్యంత సన్నిహితుడు, ప్రియస్నేహితుడు, పూర్వపరిచితుడు, వారి ఆనుపానులెరిగినవాడు. కనుక శంకరాచార్య గురుదేవునాహ్వానింపుడని పలుక శ్రీశంకరులు సగౌరవముగనాహ్వానించి సఖాసీనునొనర్చి, తమ ఆపద నెరింగించి, ఆ కాంశ్యకారవీరులను గూర్చి చరిత్ర, రహస్యములు మీరెరుగనివి కావు. ఇప్పుడున్న స్థితిలో రాజ్యరక్షణము గురుపీఠముల ప్రధానకర్తవ్యము గదా, సర్వజ్ఞులైన మీరు ఆ విశ్వకర్మాన్వయున వధించునుపాయమెరింగించి రాజ్యమును రక్షింపుడని వేడుకొనెను.
చోళరాజేంద్రా, ఆ మనుకులాచార్యుల యుద్ధమున జయించుట జరుగనిపని, తులాదండము వారి చేతనున్నంత వరకు బ్రహ్మరుద్రాదులకైనను శక్యముగాదు.
శుక్రవారము నాడు వారు సర్వాయుధములు, సమస్త వస్తువులు పూజాగృహమందుంచి పూజింతురు. మరునాడు ఉద్వాసన మొనర్చి వానిని ముట్టుదురు. శుక్రవారమునాడు మాత్రము వారు నిరాయుధులు. ఆ రోజున వారిని సామోపాయమున సభకు రప్పించి సంధియొనర్చుకొనుడు. నీవు నా ప్రియశిష్యుడవగుటచే నీ రహస్యము చెప్పి వారిని వశమొనర్చుకొను ఉపాయమెరింగించితిని. వీరులగు నా బ్రహ్మవంశీయున తో నీవు నయమున చెలిమి యొనర్చుకొమ్ము, అటుగాక కీడు తలపెట్టితివా నీకును నీరాజ్యమునకును సకలారిష్టములు సంభవింపగలవు అని పలికి తన ఆశ్రమంబునకరిగెను.
అంత రాజు కొందరు అమాత్యుల నియోగించి, మీరు జగద్గురు వంశజులైన శిల్పులవద్ద కరిగి, జరిగినదానిని మరచిపొండనియు మీ దర్పణమునకు మీరుకోరిన హేమమిచ్చెదమనియు మీయెడ మేమొనర్చిన తప్పిదమునకు క్షమాపణగా మిమ్ముసభాముఖమున సన్మానింతమనియు, మా మాటలుగా చెప్పి వారిని శుక్రవారమునాడు సాదరముగా తోడ్కొనిరండు అని పంపగా వారు వెళ్ళి ధర్మపాలునికి నమస్కించి, రాజసందేశమును వినిపించిరి.
ఆ వాక్యములకు సంతసించి ధర్మపాలుడు సంధికి సిద్ధమై కుమారుల మువ్వురను కొలువుకూటమునకంపెను. నిరాయుధులై వచ్చు వారలకు ఎదరేగి ఆహ్వానించి కుశలమడిగి, వారలకు విడిదిమందిరముల ఏర్పాటు గావించెను. సన్మానమొనరింప సభనలంకరింపుడని నాజ్ఞయొనంగెను. ఆ వీరుల నభ్యంగనాదులొనర్పుడని జట్టిల నియమించెను.
నిరాయుధులై, అర్థ వస్త్రధారలై, తైలమర్ధనమొనరించుకొనుచున్న ఆ శిల్పులను భటులు చుట్టుముట్టి బంధించిరి. కంఠములోతు గోతులు త్రవ్వి వారినిదించి కంఠములు మిగులు నట్లు బూడ్చి ఘోరముగా హింసించుచు కుత్తుకలు గోసి చంపిరిం.
శిరంబు కోయగనే తెగి ఆ శిరస్సులు మూడు భయంకరాకారమున ఆకాసమున కెగిరి పట్నమెల్ల సంచరింపదొడగెను. పట్టణమెల్ల రక్తధారలు కరిసెను. ఉత్పాతములు చెలరేగెను. భూమి కంపించెను. గ్రద్దలు మింట గుమిగూడి యాడెను.
ఈ అకాల భయవాతావరణమునకు ప్రజలు తల్లడిల్లిరి. ధర్మపాలుడు ఆశ్రమస్థలి జేరి శంకరాచార్యునొద్దకు జని దుఃఖించుచుండెను. వ్యాకుల చిత్తుడగు ఆ ధర్మపాలుని శంకరాచార్యుడోదార్చెను.
వారిరువురు కామాక్షి ఆలయమునకేగి కామాక్షీ దేవిని స్తుతించిన, ఆ తల్లి ప్రసన్నయై ధర్మపాలునోదార్చి, వరమడుగగా, దుఃఖోపశమనము పొంది ధర్మపాలుడు ఇట్లనియె. తల్లీ జగదాంబా!
దేవీ కటాక్షమున రుద్రనేనాదులు పునర్జీవితులైరి. కామాక్షీ దేవి పాదపీఠమున వారిశిరంబులు చేర్చునట్లు ఆశీస్సులనందిరి.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి