ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఆంధ్రకవితా పితామహ అల్లసాని పెద్దన

'పెద్దన' పుస్తకం నుంచి(రచయిత పేరు గుర్తులేదు)

పెద్దన్న గారికి 'ఆంధ్రకవితాపితామహుఁ'డని బిరుదు శ్రీకృష్ణదేవరాయలవారిచ్చినది. కృష్ణరాయఁడు విద్వత్ప్రభువు, భావుకుడు. సహజముగా గొప్పకవి. ఆ ప్రభువునకు తత్పూర్వమున కవిత్రయము, పోతన్న, శ్రీనాథుఁడు మొదలైన మహానుభావులున్నారని తెలియదా? నాచన సోమనయున్నాడని తెలియదా! పెద్దన్న కీ బిరుదిచ్చట యేమి? తాను వైష్ణవ ప్రభువు. పెద్దన్నకూడ వైష్ణవుఁడే. ఈ కారణముచేత నిచ్చెనా?

లేదా, ఆంధ్రకవిత యనగా, కృష్ణరాయని యభిమతము వేఱా? తత్పూర్వకవులందఱు సంస్కృతకావ్యములు తెలుగు చేసిరి. తొలుదొల్త స్వతంత్రకావ్యమును తెలుగులో పెద్దన గారే వ్రాసిరి. అందుచేత నిచటినుండియే యాంధ్రకవితాప్రారంభ మనియా?  పెద్దన్నగారును మార్కండేయ పురాణములోని కథను స్వీకరించియే వ్రాసిరి. పూర్వకవుల తెల్లగుసేతయు మక్కికి మక్కిగా లేదు. కనుక నిదియే యాంధ్రకవితాసమారంభ మనుటకు రాయల వారి బుద్ధిలో పద్యరచన యని కాదు. తెలుగు సేత కాదు. స్వతంత్రకావ్య మనిపించుకోదగిన యాంధ్రగ్రంథమని నిర్ణయము చేసికోవచ్చును. ఇచట ప్రాధాన్యము కావ్యశబ్దమునకు. ఈ లెక్కను భారతము కావ్యము కాసింత పెంపులు, తగ్గింపు లున్నను తెలుగులో స్వతంత్రకావ్యము కాదు. శ్రీనాథుని నైషధము కాదు. భాగవతమును గాదు.

కావ్యలక్షణములు పట్టించినచో మనుచరిత్రయే ప్రథమ కావ్యము. ఒక గ్రంథమును కావ్యముగా నిర్ణయించ వలసివచ్చినప్పుడు ప్రసిద్ధమైన మార్గమ`కటి కలదు. ఏకరసాశ్రయమైన కథ. శృంగారరస మైనచో నాయికానాయకులు, తదితరరసములకు తత్తదుచితలక్షములు, ప్రధానరసము, అంగరసములు, వాని పొసగింపు, నాయకలక్షణము మొదలైనవాని పరామర్శ. ఇది ప్రసిద్ధమైన కావ్యలక్షణము.

రెండవది ప్రసిద్ధమైనది కాదు, అనగా బహుజనుల చేత పర్యలోచింపఁబడుచున్నది కాదు. ఒక్కొకపడీ రెండవలక్షణము మొదటి లక్షణముగల కావ్యమునిండ నిండియుండవచ్చును. ఈ కావ్యలక్షణము శిల్పముతో కూడినది. శిల్పశబ్దము సునిర్దిష్టార్థకము కాదు. శిల్ప మన్నమాట సారస్వతములోనికి గౌణార్థముగా తెచ్చికొన్నదికాని, సారస్వతమునకు సహజమైనది కాదు.

ఇంకా వుంది.....

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గిజిగాడు

జిలుగుం బంగరు రంగులం గులుకు మేల్చిన్నారి పూగుత్తి సొ మ్ములు గీలించిని తుమ్మగొమ్మలకు, నీవు న్నీ సతీరత్న మూ యెల గీమున్ దగిలించి రేఁబవలు హాయిందూఁగరా గాడ్పు బి డ్డలు మీ కూడిగ మాచరింప, గిజిగాఁడా నీకు దీర్ఘాయువౌ! తేలిక గడ్డి పోచఁలను దెచ్చి, రచించెద వీవు తూఁగటు య్యేల గృహంబు, మాలవుల కేరికి సాధ్యముగాదు, దానిలో జాలరు, లందులో జిలుఁగు శయ్యలు నంతిపురంబు లొప్పగా మేలు భళీ! పులుంగుటెకిమీడవురా గిజిగాఁడ? నీడజా! కులుకు పసిండినిగ్గుల దుకూలములన్ ధరియించి ముద్దు బి డ్డలును, బడంతి నీ పొదిగిట న్ని దురింపఁగఁ గన్నెగాడ్పు లూ యెల సదనంబుఁలూచ, భయమింత యెరుంగక కన్నుమూయు నీ యలఘు సుఖంబు మాకుఁ గలదా! గిజిగా? యొక ఱేని కున్నదా? అందమున నీకు నీడగు నందగాడు గృహవినిర్మాణమున నిన్ను గెలుచువాడు వైభవంబునఁ బోలు దేవతల ఱేఁడు లేఁడురా గి జిగా! మొనగాఁడ వోయి నీ గిజిగాని నామకము, నీ తెలివిం బ్రకటించు గూడు, నీ మైఁగల సోయగం బవని మానవకోటికి ముద్దుసేయు నో యీ! గిజిగాడ! భీతిలకు! నీవు ధరాతలి నున్న బిట్టుగా వాగెడు నాస్తికు ల్తలు వంతు రనంతుని చెంత ఖిన్నులై.

తెలుగు భాష తీపిదనం

సి.వేదవతి గారి పుస్తకం 'తెలుగు-వెలుగు' నుంచి. "మహిమున్ వాగను శాసనుండు సృజియంపం గుండలీంద్రుండు దన్ మహనీయస్థితి మూలమై నిలువ శ్రీనాథుండు ప్రోవన్ మహా మహులై సోముడు భాస్కరుండు వెలయింపన్ సొంపు పాటించు నీ బహుళాంధ్రోక్తిమయ ప్రపంచమున తత్ప్రాగల్భ్య మూహించెదన్."                                                                                                    - రామరాజ భూషణుడు. వేయి ఏళ్ళుగా తెలుగుజాతి వేయి విధాలుగా పండించుకొన్న సజీవ భాష తెలుగు భాష. ఆంధ్రభాష అమృతం వంటిదనీ, దేశ భాషలలో ఎన్నికను గడించిందనీ అనటానికి...

పాత పుస్తకాలు - డౌన్లోడ్ చేసుకోవటం - Digital Library of India

మొదట  Downloader-NEW ( Downloader-OLD )ని డౌన్లోడ్ చేసుకోండి. ఇంతకు ముందే Downloader-OLD డౌన్లోడ్ చేసుకున్నట్లయితే  update(NEW) కోసం Update(12-09-10) click చెయ్యండి.  Unzip చెయ్యండి. runDM.bat file ని run చెయ్యండి. 'chandamama' option select చేయండి. 'Download Location' field లో మీరు ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ ఇవ్వండి like C:\ లేదా 'Browse' Button click చేసి  location select చేసుకోండి. 'Year','Month' select చేసుకొని 'download' button click చెయ్యండి. ఒక్కో పేజి download అయిన తర్వాత ఇది ఒకే pdf file గా కలుపుతుంది(with year-month name). -------------------------------------------  1st Picture లో 'Digital Library ' select చేసుకుంటే Digital Library of India నుంచి పుస్తకాలు డౌన్లోడ్ చేసుకోవచ్చు. 'http://www.new.dli.ernet.in/'   లో పుస్తకం వెతికి URL తెచ్చుకొని, దాన్ని 'URL' field లో paste చేసి 'add to download ' button click చెయ్యండి. తర్వాత 'd...