వసుధర కథలు పుస్తకం నుంచి "మన దేశంలో ప్రతి భర్తా భోజరాజు, ప్రతి భార్యా కాళిదాసు. వారి అనుబంధాల నుంచి పుట్టిన జీవిత ప్రబంధాల ముందు కాళిదాసు ప్రబంధాలు కూడా వెలవెలబోక తప్పదు." "మీ తొలిరాత్రి అనుభవాలు నాకు చెప్పాలి. ఏ సంకోచమూ లేకుండా జరిగింది జరిగినట్లు చెప్పాలి. మీ వివరాలు రహస్యంగా వుంచబడతాయి. మీరు నిజీయితీ పటిస్తే అందువల్ల ఎందరో యువతి యువకులకు ఎంతో ప్రయోజనం" అంది కుసుమ. ఆ గదిలో వున్న ఆరుగురు ఆడవాళ్ళూ ముఖముఖాలు చూసుకున్నారు. వాళ్ళక్కడ పోసుకోలు కబుర్లకు చేరారు. కబుర్ల మధ్యలో శృంగారం చోటుచేసుకోబోతే తనకి ఆసక్తిలేనట్లుగా ముఖం చిట్లించింది గూడా, వారిలో జయ అనబడే ఆమె. మిగతా అయిదుగురూ ఆ పేటవారే! జయమాత్రం ఏదో పనిమీద పుట్టింటికి వచ్చి పదిరోజులైంది. ఇంకో రెండువారాలుంటుంది. జయకు వయసు ౩౦-౩౫ మధ్యలో వుంటుంది. పద్ధెనిమిదో ఏట పెళ్ళై కాపురానికి వెళ్ళింది. ఇద్దరు పిల్లల దల్లి అయినా బయటివాళ్ళతో ఆ కబుర్లు ఏ సందర్భంలోనూ మాట్లాడదు. మనిషి కూడా గంభీరంగానూ, హుందాగానూ వుంటుంది. పుట్టింటికెప్పుడొచ్చినా అమ్మలక్కలామెను అభిమానంగా పిలుస్తుంటారు. అందరితోనూ మంచిగా వుంటూ అందరి గురించీ మంచే ...
క్షోణితలంబు నెన్నుదురు సోకగ వందనంబు తెలుగు తల్లికి.