ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

అర్ధశతాబ్దపు ఆంధ్రసాహితి

నాకు జ్ఞాపకం ఉన్నంతవరకు ఇంచుమించు ౧౯౧౬ ఆ ప్రాంతాన తెలుగులో మొదటి ఆధునిక పద్యకావ్యం అవతరించినది. ఇది శ్రీ రాయప్రోలు సుబ్బారావు రచన, తృణకంకణము. ఈ రచనలో - నాకు తెలిసినంతవరకు - మొదటి సారిగా మోహానికి బదులు ప్రేమ, కామవాంఛకు బదులు స్నేహము ఇటువంటి భావాలు ప్రకటిత మగుతాయి. అప్పుడు వారికి ఇంచుమించు సమకాలికంగా అబ్బూరి రామకృష్ణారావు, బసవరాజు అప్పారావు, మహాకవి గురజాడ అప్పారావు తమ క్రొత్త నగలతో ఆంధ్రమాతను అలంకరించారు. ఆ రోజులలో అబ్బూరి రామకృష్ణారావు రచించిన పద్యములను ఇంగ్లీషులో పాస్టరల్ పొయట్రీ అనవచ్చును. ఇది అప్పుడు మలకు క్రొత్త. కాపుపాటలో ఆయన అంటారు.
ఇలా... ...

ప్రేయసి లేచి రమ్ము, చివురించిన మావులక్రింద శీతల
చ్ఛాయలలోన యౌవనవసంతశుభోదయ మయ్యె నవ్వుచున్
చేయికిఁ జేయిఁ జేర్చి పరచింతనలన్ మరపించురాగముల్
దీయుచు వాసన ల్పరిమళించెడు చోటులయందుఁ బోవఁగన్ - అని

ఈ ధోరణినే లోకముతో మన కేటికి లోలాక్షీ రా పోదము జీవితంపు వంత గూర్చి పాడు ఈ లోకముతో మన కేటికి - అని దూకుడుతో గానము చేసిన బసవరాజు అప్పారావు కవిత క్రమక్రమంగా పరిణతిని చెంది ఆయన పటపత్రశాయిని గురించి ఒంటిగా నుయ్యాల లూగితివా నా ముద్దుకృష్ణా, జంటగా నను పిల్వ దగదోయూ - అంటూ చక్కని రచన సాగించారు. ఆ విశిష్టమైన అనుభవ పరంపర అంతా ఆయన తాజమహల్ లో చూడవచ్చు మనము.

దీర్ఘమై, పాండితీ ప్రకర్షే ప్రధానలక్ష్యంగా గల సంస్కృత సమాసాలకు బదులు చక్కని తేట తెలుగులో ఉన్నత భావాలను అద్భుతమైన అనుభవ పరం పరను వ్యక్తము చేయవచ్చునని నిరూపించారు శ్రీ బసవరాజు అప్పారావు. సుమారు ౧౯౨౩ లో అచ్చయిన బాష్పదౌత్యమలో శ్రీ దువ్వూరి రామిరెడ్డి గొప్ప ఊహనూ, మెచ్చుకోతగిని భావననూ ప్రకటించారు ఇలా

జీవనగంగా హరిత తటంబునఁ
జింతా వటతరు మూలమునన్
ఏల యధోముఖివై నడతెంచెద
వివ్విధి యౌవన నశలన్ - అంటాడు

ఆ దశాబ్దంలోనే చదువరులను చాలా ఆనందపరచినది కొడవటిగంచి వెంకటసుబ్బయ్య ఆతిథ్యము. ఈ రచనలో నడక అందంగా ఉండడమే గాక నవకవితకు చెందిన ప్రధాన లక్షణాలు సౌకుమార్యము, రామణీయకత, భావ శబలత ప్రత్యక్ష మగుతాయి

ఆగుమాగుము తెరువరీ ఆ
యాస భేదము నపనయింపుము
మా గృహాంగణ కుసుమ సముదయ
మధువు లియ్యవిగో

ఇటువంటి మాటలు, ఇటువంటి భావాలు నవకవితలో నిండుగా ఉండడము వల్లనే శ్రీయుతులు కాటూరి వేంకటేశ్వరరావు, పింగళి లక్ష్మీకాంతంగారు తమ కవితా సామగ్రిలో, నవకవితలో తుషారజలము, కలుపూమెత్తందనము, పచ్చకర్పూరపు గుబాళింపు, చలువతెమ్మెరలు - ఇలాంటివి ఉంటాయని నిర్వచించారు. శ్లేష కవితా మంజూష, కొరకుపడని సంస్కృత దీర్ఘసమాసములూ, విపరీతమైన ఉత్ప్రేక్ష ఇవి నవ్యసాహితిలో దొరకవని వారు విశదీకరించారు. అందుకు తార్కాణంగా వారి రచనే చూడవచ్చును.

ఒక్కొక సుమమ్మె యేర్చి నీ కుపద నీయ
గుణము కొని యల్లనల్లన గ్రుచ్చుచుండఁ
బూర్వ పూర్వ గ్రథిత మైన పూలు రాని మొదలు కన్పిచ దీ స్రజమ్మునకు నాథ

పూలు రాలుష గాక పొలివోక తుదిమొదల్
నిలుచుసూత్రమైన నే గ్రహించి
పూలు రాలినట్టి మాలిక తెత్తునా
సాక్షిగాను నా ప్రయత్నములకు - అని

౧౯౨౨ ఆ ప్రాంతాలలో మన తెనుగు భాషకు నవచైతన్యము కలిగినది. ఇంతకు ముందుగా శ్రీ గురజాడ అప్పారాయకవి క్రొత్త ఫక్కీలో ఇంచుమించు శిష్టవ్యవహార భాషలోనే చక్కని రసవంతమైన ముత్యాలసరాలు వ్రాస్తూ మార్గ దర్శకులయ్యారు. వారు రచించిన దేశభక్తి గేయము - దేశమును ప్రేమించు మన్నా - అనేది జనరంజకమైనది. ఆ గేయములోనే ఉన్న - దేశమంటే మట్టిగాదోచి, దేశంటే మనుషులోయి - అనే ప్రవచనం సామ్యవాదుల ప్రచారమున కవసరమైన నినాదంగా పరిణమించినది. కాని శ్రీ గురజాడ అప్పారాయకవి రచనలలోకల్లా చాలా గొప్పది పుత్తడిబొమ్మా పూర్ణమ్మా అనే విషాద గాథ. కన్యాశుల్కమనే దురాచారానికి బలియైన ఒక బాలిక కథ ఇది. ఈ గేయము వింటూంటే కన్నీరు నించనివా రుండరు.

ఇటువంటి వాతావరణంలో ఉదయించినది నవ్యసాహిత్య పరిషత్తు. ఈ పరిషత్తు సభ్యులు స్త్రీని కేవలం ఆటవస్తువుగా గాక ఒక ఆరాధ్యదేవతగా ఆరాధింపసాగారు. దీనికి దారి చూపినది శ్రీ శివశంకర శాస్త్రి హృదయేశ్వరి కావ్యము. శ్రీ కృష్ణశాస్త్రి ఒకానొక విచిత్ర పరిస్థిలో విపరీతమైన పశ్చాత్తాపానికి గురియై ఆకారణంగా దుఃఖమే ప్రాణసఖిగా కృష్ణపభము అనే ఖండకావ్య సంపుటి రచించారు. తర్వాత అతని జీవితంపైన ఒకానొక మహోన్నతమైన ప్రేమభావము ప్రసరించి ఊర్వశి, ప్రవాసము అనే మహారచనలు అవతరించాయి. శ్రీ కృష్ణశాస్త్రి అతి సుకుమారంగా పద్యము నల్లగలడు. మంచి మంచి మాటలను ఏరి కూర్చగలడు. అతని ఊహ, శిల్పనైపుణ్యము అద్వితీయమైనవి. మాటల పొందిక కూడా చాలా గొప్పది. సడిలేని నడిరేయి బడిపోవు కడియాల రవళులు - అంటాడు, ఎంతో అందంగా. అతని ఊర్వశి అంటుంది ఒకచోట - దాసి అక్షయ ప్రేమ సేవ కీ లతాంతాల మొత్తాలు చాలునోయి - అనీ, నింగిమూలల నీలిపందిళ్ళు పరచి ఎంత తెలిమల్లెతోట వేయించినానొ - అన్నీ. కాని కృష్ణపక్షములో శ్రీ కృష్ణశాస్త్రి ప్రేమ సఫలము గాకపోగా శ్రీ నాయని సుబ్బారావు ప్రేయసి వత్సల. ఆమెను గురించి ఇలా వ్రాస్తారు. ఆయన -

వత్సలాఫాలమున నెలవంక గురుతు
కందళించి, వికాసించి, కళలు దేరి
తరుణశారద రాకా సుధాకరాచ్చ
బింబము లనంతములు లెక్కపెట్టుకొనెడు - అని

ఇది ఇంత ఉదాత్తమైన ఫలశ్రుతి ఇలా ఉండగా, శ్రీ కృష్ణశాస్త్రి అంటాడు - ప్రేయసి సోయగమ్మునకు లేదు శరీరము - లేదు మేను నీ తీయని ప్రేమ కేని. కలదే ఎడబాటిక మాకు అని. మరోచోట అంటాడు అతను - ప్రభాత శీతశైలసానూపలసీమల నొత్తకయే స్రవించు ఆహిమానీవరగాయనీగళవినిస్స్రుతమాధురి మంటి కీడ్తురా - అని. ఇవన్నీ తెనుగు పద్యరచనకు ఎనలేని అలంకారాలు.

స్త్రీని ప్రేమమూర్తిగా ఆరాధించడము శ్రీ వేదుల సత్యనారాయణ రచనలో అవధి నందుకొన్నదనవచ్చును.

ఆమె నవనీత హృదయ, నాయంతరంగ
శాంతిదేవత, ఆశాపథాంతరాళ
పారిజాతమ్ము, ప్రేమజీవన విభాత
కైశికీగీతి, నాతపః కల్పవల్లి - అని

శ్రీ నోరి నరసింహశాస్త్రి దేవీభాగవతములో నిమగ్నులుకాగా, శ్రీ విశ్వనాథ సత్యనారాయణ కొంత భావకవిత్వము వ్రాసి తర్వాత రామాయణ మహాకావ్యమును క్రొత్తరీతిని వ్రాయసాగారు. ఇది ఒక గొప్ప యత్నము.

ఈ గొప్ప కృషి అంతా ఇలా సాగుతుండగా మొట్టమొదట కొన్ని వృత్తాలు ఎంతో బాగా వ్రాసే శ్రీశ్రీ అత్యాధునిక పాశ్చాత్యరీతుల ప్రభావమున మరీ సూతనమైన కవితను వ్రాయ నారంభించాడు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గిజిగాడు

జిలుగుం బంగరు రంగులం గులుకు మేల్చిన్నారి పూగుత్తి సొ మ్ములు గీలించిని తుమ్మగొమ్మలకు, నీవు న్నీ సతీరత్న మూ యెల గీమున్ దగిలించి రేఁబవలు హాయిందూఁగరా గాడ్పు బి డ్డలు మీ కూడిగ మాచరింప, గిజిగాఁడా నీకు దీర్ఘాయువౌ! తేలిక గడ్డి పోచఁలను దెచ్చి, రచించెద వీవు తూఁగటు య్యేల గృహంబు, మాలవుల కేరికి సాధ్యముగాదు, దానిలో జాలరు, లందులో జిలుఁగు శయ్యలు నంతిపురంబు లొప్పగా మేలు భళీ! పులుంగుటెకిమీడవురా గిజిగాఁడ? నీడజా! కులుకు పసిండినిగ్గుల దుకూలములన్ ధరియించి ముద్దు బి డ్డలును, బడంతి నీ పొదిగిట న్ని దురింపఁగఁ గన్నెగాడ్పు లూ యెల సదనంబుఁలూచ, భయమింత యెరుంగక కన్నుమూయు నీ యలఘు సుఖంబు మాకుఁ గలదా! గిజిగా? యొక ఱేని కున్నదా? అందమున నీకు నీడగు నందగాడు గృహవినిర్మాణమున నిన్ను గెలుచువాడు వైభవంబునఁ బోలు దేవతల ఱేఁడు లేఁడురా గి జిగా! మొనగాఁడ వోయి నీ గిజిగాని నామకము, నీ తెలివిం బ్రకటించు గూడు, నీ మైఁగల సోయగం బవని మానవకోటికి ముద్దుసేయు నో యీ! గిజిగాడ! భీతిలకు! నీవు ధరాతలి నున్న బిట్టుగా వాగెడు నాస్తికు ల్తలు వంతు రనంతుని చెంత ఖిన్నులై.

తెలుగు భాష తీపిదనం

సి.వేదవతి గారి పుస్తకం 'తెలుగు-వెలుగు' నుంచి. "మహిమున్ వాగను శాసనుండు సృజియంపం గుండలీంద్రుండు దన్ మహనీయస్థితి మూలమై నిలువ శ్రీనాథుండు ప్రోవన్ మహా మహులై సోముడు భాస్కరుండు వెలయింపన్ సొంపు పాటించు నీ బహుళాంధ్రోక్తిమయ ప్రపంచమున తత్ప్రాగల్భ్య మూహించెదన్."                                                                                                    - రామరాజ భూషణుడు. వేయి ఏళ్ళుగా తెలుగుజాతి వేయి విధాలుగా పండించుకొన్న సజీవ భాష తెలుగు భాష. ఆంధ్రభాష అమృతం వంటిదనీ, దేశ భాషలలో ఎన్నికను గడించిందనీ అనటానికి...

హనుమత్ కవచం

శ్రీ పంచముఖీ హనుమత్ కవచమ్ ఓం అస్య శ్రీ పంచముఖీ వీర హనుమత్ కవచ స్తోత్త్ర మహా మంత్రస్య బ్రహ్మఋషి:గాయత్రీ చ్ఛంద: శ్రీ రామచంద్రో దేవతా రామ్ బీజం మం శక్తి: ఇతి కీలకం శ్రీ రామచంద్ర ప్రసాద సిద్ధ్యర్ధే పంచముఖీ వీర హనుమత్ కవచ స్తోత్త్ర మంత్ర జపే వినియోగ: రాం అంగుష్ఠాభ్యాం నమ:, రీం తర్జనీభ్యాం నమ: రూ మథ్యమభ్యాం నమ: రై: అనామికాభ్యాం నమ: రౌం కనిష్ఠకాభ్యాం నమ: రం కరతల కర పృష్ఠాభ్యాం నమ: రాం హృదయాయ నమ: రీం శిరసే స్వాహా, రూం శిఖాయై వషట్ రైం కవచాయ హుం రౌం నేత్రత్రయాయ వౌషట్ అస్త్రాయ, ఫట్ భూర్భువ స్సువరోమితి దిగ్బంధ: ధ్యానం వందే వానర నారసింహ ఖగరాట్ క్రోఢాశ్వ వక్త్రాం చితం నానాలంకరణం, త్రిపంచ నయనం, దేదీప్యమానం రుచా || హస్తాబ్జై అర సిఖైట పుస్తక సుధా కుంభాం కుశాద్రీన్ గదాం ఖట్వాంగం ఫణి భూరుహౌ దశ భుజం సర్వారి గర్వాపహమ్ అథ ధ్యానం ప్రవక్ష్యామి శ్రుణు పార్వతి యత్నత: మద్వ్రతం దేవదేవస్య ధ్యానం హనుమంత: పరం పంచవక్త్రం మహాభీమం త్రిపంచ నయనైర్యుతం దశబిర్బాహుభిర్యుక్తం సర్వకామ్యార్ధ సిద్ధిదమ్ పూర్వేతు వానరం వక్త్రం హృదయం సూర్య సన్నిభం దంష్ట్రా కరాళ వదనం భ్రుకుటీ కుటిలోద్భవమ్ అన్యైకం దక్షిణం ...