ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి గారి పుస్తకం నుంచి "మేష్టారూ! ఈ తెలుగు వాక్యాలు ఎంత "చెవికిం(కం)పుగా" ఉన్నాయో చిత్తగించండి - ౧. మద్యము సేవించువారు తమ శరీరములో పోషక పదార్థాల లేమిని కలిగియుందురు. ౨. స్పీకరు సభ్యునితో ప్రమాణము చేయించెను. ౩. ఈ కమిటీచే మంత్రులు ఎన్నుకొనబడగూడదు. ౪. మన దేశమును ఆంధ్రమని పిలుతురు ౫. ఈ సభలో మాతో సహకరించి నిశ్శబ్దముగా కూర్చుండుడు. ౬. నిన్న బజారులో ఎవనిని చూచితినో వాడే నేడు మా యింటివద్ద ప్రత్యక్షమైనాడు. వ్యాకరణరీత్యా చూస్తే పై వాక్యాలలో ఏమీ తప్పున్నట్టు కనబడదు. కాని, అందులో ఏదో ఒక జీవలక్షణం లోపించి ఎబ్బెట్టుగా ఉన్నట్టుంది. లోపం ఎక్కడ ఉందంటారు.?" "జగన్నాథం ! నీ ఆవేదన నా కర్థమయింది. వాక్యంలో ఏవైనా అపశబ్దాలుంటే - అవి పొరపాటుగా వచ్చాయనో, సరియైన పరిజ్ఞానం లేక పడ్డాయనో అనం సరిపెట్టుకోవచ్చు. తిరిగి సరిచూచుకొని దిద్దుకోవచ్చు. కాని నీ చెవికి కటువుగా వినిపించినవి అపశబ్దాలు కావు, అపవాక్యాలు! ఒక దేశీయుడు పలికే వాక్యానికి ఒక జీవలక్షణం వుంటుంది. అతడు వాక్యం కూర్చేతీరు, విభక్తి అతికే విధం, పలికించే కాకువు, ఒక ప్రత్యేక లక్షణంతో వుంటుంది. దానినే ను...
క్షోణితలంబు నెన్నుదురు సోకగ వందనంబు తెలుగు తల్లికి.