భారతీయ బాలబాలికలకూ, యువతీ యువకులకూ, మన సనాతనధర్మంపట్ల ఆ సనాతన ప్రవచించే వేదపురాణ శాస్త్ర కావ్యవాజ్ఞయంపట్ల ఆసక్తి పెంచటం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ప్రయత్నం లో ఓ భాగం వేదములు, వేదాంగములు, ఉపనిషత్తులు, స్మృతులు, ఇతిహాసములు వేదములు హిందూధర్మమునకు వేదములే మూలము.వేదము భగవంతుని వచనమే. ప్రపంచ సాహిత్యములో వేదములకంటే ప్రాచీనమైన సాహిత్యము మరొకటిలేదు. అత్యంత పురాతనమైన వైదిక సంస్కృతములో వేదములు రచింపడినవి. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము అని వేదములు నాలుగు. ఒక్కొక్క వేదము కర్మకాండ అనియు, జ్ఞానకాండయనియు రెండుగా విభజింపబడినది. కర్మకాండములో యజ్ఞాదికర్మలు వివరింపబడినవి. జ్ఞానకాండములో బ్రహ్మతత్త్వము నిరూపింపబడినది. ఒక్క పరబ్రహ్మను తెలిసికొన్నచో తక్కిన సమస్తమును తెలిసికొన్నట్లే. కావున బ్రహ్మ స్వరూపములు నిరూపించు వేదభాగము మిక్కిలి ముఖ్యమైనది. దీనినే వేదాంతము, లేదా ఉపనిషత్తులు అని పిలుతురు. మంత్రద్రష్టలైన ఋషులు మొదట వేదముల నుచ్చరించిరి. వారు వేదములకు ద్రష్టలేకాని కర్తలు కారు. కావుననే వేదములు అపౌరుషేయము లనియు, నిత్యము లనియు చెప్పడినవి. వేదవ్యాసుడు ఈ వేదములను నాలుగుగా విభజి...
క్షోణితలంబు నెన్నుదురు సోకగ వందనంబు తెలుగు తల్లికి.